శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Mar 31, 2020 , 23:02:14

ఒకే చోట ఉండకుండా... మార్కెట్ల తరలింపు

ఒకే చోట ఉండకుండా...  మార్కెట్ల తరలింపు

ఎల్బీనగర్‌: కరోనా నేపథ్యంలో మార్కెట్లు ఒకే చోట ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డును సందర్శించారు. అనంతరం ఎల్బీనగర్‌లోని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక దూరం సమస్య వస్తున్నందున మార్కెట్‌ యార్డు నుంచి పుచ్చకాయ అమ్మకాలను కొత్తపేట నుంచి ఎల్బీనగర్‌ వరకు సర్వీస్‌రోడ్డుపై చేపట్టాలన్నారు. సరూర్‌నగర్‌ రైతుబజార్‌ వెనుక ప్రాంతంలోని ఖాళీ స్థలంలో బత్తాయి, సంత్రా వ్యాపారాలను తరలించేందుకు నిర్ణయించామన్నారు. మామిడికాయల విక్రయాల కోసం కోహెడ వద్ద మార్కెట్‌ కోసం కేటాయించిన స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తామన్నారు. కూరగాయల కొరత రాకుండా 500 రైతుబజార్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అదనపు డైరెక్టర్‌ లక్ష్మణుడు, అదనపు డైరెక్టర్‌ రవికుమార్‌, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరమల్ల రాంనర్సింహాగౌడ్‌, ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రావు, ఎస్‌జీఎస్‌ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 


logo