గురువారం 28 మే 2020
Hyderabad - Mar 31, 2020 , 22:50:07

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ఆర్కేపురం: మహేశ్వరం, ఎల్బీనగర్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోంలో రైతు బజార్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. విశాలమైన మైదానంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేశామన్నారు. సరూర్‌నగర్‌ రైతుబజార్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించారు. మంగళవారం తాత్కాలిక రైతుబజార్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ శాఖ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరమళ్ల రామ్‌నర్సింహగౌడ్‌, సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ పారుపల్లి అనితతో కలిసి వీఎంహోంలో ప్రారంభించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైర్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి పారుపల్లి దయాకర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ప్రధానకార్యదర్శి బేర బాలకిషన్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌కుమార్‌, ఆర్కేపురం డివిజన్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇంట్లోనే ఉందాం.. కట్టడి చేద్దాం

పహాడీషరీఫ్‌: ఇంట్లోనే ఉండి.. కరోనాను కట్టడి చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జల్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు, కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించారు.  రసాయనాలు పిచికారీ చేసేందుకు కొనుగోలు చేసిన రెండు యంత్రాలను ఆమె ప్రారంభించారు. ఇటీవల ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ అబ్దుల్లా సాది, వైస్‌ చైర్మన్‌ ఫర్హనానాజ్‌, కమిషనర్‌ సఫీ హుల్లా, ఏఈ కిష్టయ్య, మేనేజర్లు సుదర్శన్‌, ఠాగూర్‌ పాల్గొన్నారు.


logo