బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Mar 30, 2020 , 23:34:55

అత్యవసర సేవలకు 13 అంబులెన్స్‌లు

అత్యవసర సేవలకు 13 అంబులెన్స్‌లు

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: ప్రజల అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలుగకుండా సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ అంబులెన్స్‌ సర్వీసును ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీపీ సజ్జనార్‌ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యురిటీ కౌన్సిల్‌, ప్రైవేటు దవాఖానల యాజమాన్యం సహకారంతో 13 అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీలు వెంకటేశ్వరరావు, రోహిణి ప్రియదర్శిని, పద్మజ, అనసూయ, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణేఏదుల, పలు దవాఖానల యజమానులు తదితరులు పాల్గొన్నారు.  


logo