శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Mar 30, 2020 , 23:22:36

అప్రమత్తతతోనే కరోనాకు చెక్‌

అప్రమత్తతతోనే కరోనాకు చెక్‌

 • జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో యూసుఫ్‌గూడ, షేక్‌పేటలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పర్యటించారు. ప్రజలకు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. వలస, దినసరి కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పారు.  
 • నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ (ఎస్‌బీ) తరుణ్‌జోషి బృందం సోమవారం ఫలక్‌నుమా రైతుబజార్‌ను సందర్శించారు. ప్రభుత్వ సూచన మేరకు కూరగాయాల ధరలు ఉన్నాయా లేక అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే విషయాలను తెలుసుకున్నారు.
 • శామీర్‌పేట మండలం యాడారంలో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, సర్పంచ్‌ వై.సుజాత, ఉపసర్పంచ్‌ సాయిబాబా ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు, గుడ్లు పంపిణీ చేశారు.
 • మూడుచింతలపల్లి మండలం నాగిశెట్టిపల్లిలో కరోనాపై సర్పంచ్‌ మొగుళ్ల కృపాకర్‌రెడ్డి మాస్కులు పంపిణీ  చేశారు.
 • ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో వైద్యులకు, నర్సులకు, రోగులకు, పారామెడికల్‌, సెక్యూరిటీ సిబ్బందికి సానిటైజర్‌, గ్లౌజులు, మాస్కులను చాతీ దవాఖాన సూపరింటెండెంట్‌ మెహబూబ్‌ ఖాన్‌కు హైదరాబాద్‌ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు ఎస్‌.ఎం.హుస్సేని అందజేశారు.
 • మల్కాజిగిరి నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ అమలును ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. 
 • లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్డెక్కిన 14 వాహనాలను నేరేడ్‌మెట్‌ పోలీసులు సీజ్‌ చేశారు. 
 • మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిళ్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వ పర్యవేక్షణలో మొబైల్‌ రైతుబజార్‌ను నిర్వహించారు. 
 • రామంతాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు  నెహ్రూనగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. 
 • చర్లపల్లి పారిశ్రామికవాడలో పనిచేసే బీహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన కార్మికులతో కలిసి సంబంధిత కాంట్రాక్టర్‌తో అధికారులు సమావేశమై నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.  
 • కాప్రా సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఎనిమిది అన్నపూర్ణ కేంద్రాల్లో పేదలు, కూలీలకు ఉచితంగా మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పిస్తున్నట్టు సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శైలజ పేర్కొన్నారు. 
 • పీర్జాదిగూడ నగరపాలకలోని పలు డివిజన్లలో పైర్‌ఇంజిన్‌ ద్వారా శానిటైజర్‌ను మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి పిచికారి చేయించారు. 
 • మలక్‌పేట, యాకుత్‌ఫురా నియోజకవర్గాల్లో బీజేపీ నాయకుడు కొత్తకాపు రవీందర్‌రెడ్డి సైదాబాద్‌ రెడ్డిబస్తీలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయగా, కల్యాన్‌నగర్‌ కాలనీలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో కార్పొరేటర్‌ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి పిచికారి చేయించారు.
 • అబిడ్స్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేష్‌ జైస్వాల్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్పొరేటర్లు మమతా సంతోష్‌గుప్తా, పరమేశ్వరిసింగ్‌ కాలనీల్లో రసాయనాలు పిచికారి చేయిస్తూ ఆహార పొట్లాలను అందజేస్తున్నారు. 
 • నాంపల్లిలో ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌, నాంపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి సీహెచ్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ ఇంటింటికీ తిరిగి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • కార్వాన్‌లో తూముకుంట అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ ప్రకాశ్‌, సంజయ్‌, ఠాకూర్‌ అమర్‌సింగ్‌ ప్రజలకు నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలు  పంపిణీ చేశారు.
 • భోలక్‌పూర్‌లోని మల్లన్న టెంపుల్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నేత కోక రవీంద్ర జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.  
 • బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో డీసీ వేణుగోపాల్‌, ఏఎంఓహెచ్‌ హేమలత లతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ పర్యటించారు.   
 • శివగంగానగర్‌లోని శ్రీ లక్ష్మాణేశ్వరస్వామి ఆలయంలో మహా మృత్యుంజయయజ్ఞం నిర్వహించారు.
 • హైదర్షాకోట్‌లో 39మంది మున్సిపల్‌ సిబ్బందికి నెలకు సరిపడానిత్యావసర సరుకులను కార్పొరేటర్‌ సంతోషిరాజిరెడ్డితో కలిసి బండ్లగూడ డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. 
 • సాతంరాయిలో మున్సిపల్‌ చైరపర్సన్‌ సుష్మ ఆధ్వర్యంలో, బాలయేసుకాలనీ గణేశ్‌ ఉత్సవ సమతి ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందజేశారు. 


logo