బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Mar 30, 2020 , 23:29:49

సీఎం సహాయనిధికి విరాళాలు

సీఎం సహాయనిధికి విరాళాలు

  • కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు  తెల్లపూర్‌ నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రమణ రూ.3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మియాపూర్‌ ఏసీపీ కృష్ణ ప్రసాద్‌ సమక్షంలో డీమార్ట్‌ ప్రతినిధులకు అందించారు. 350 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడానికి ఉపయోగించాలని కోరారు.  
  • కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని మహదేవపురానికి చెందిన శశికాంత్‌, శ్రీనివాస్‌రావు, ఎల్లయ్యచారి, వెంకటరాజు, రవీందర్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, ప్రవీణ్‌ కుమార్‌ సీఎం సహాయనిధికి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేకానంద్‌కు చెక్కును అందజేశారు.
  • సలీంనగర్‌ కాలనీలోని కేఎస్‌ఆర్‌ రెసిడెన్సీ వాసులు సీఎం సహాయనిధికి  విరాళాలు అందజేశారు. అనిల్‌కుమార్‌ శర్మ రూ.21 వేలు, కృష్ణకుమారి త్రివిక్రంరావు రూ.21 వేలు కార్పొరేటర్‌ సునరితారెడ్డికి అందజేశారు. 
  • ముఖ్యమంత్రి సహాయనిధి కోసం టీఆర్‌ఎస్‌ నాయకుడు సుంకు రాంచందర్‌ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు రూ. లక్ష చెక్కు అందజేశారు.


logo