బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Mar 30, 2020 , 00:07:51

సీఎం మాటను గౌరవించి.. పెండ్లి వాయిదా వేశారు

సీఎం మాటను గౌరవించి.. పెండ్లి వాయిదా వేశారు

హైదర్‌నగర్‌:  కరోనా నేపథ్యంలో శుభకార్యాలు వాయిదా వేసుకోవాలన్న సీఎం మాటను గౌరవించి ఓ కుటుంబం పెండ్ల్లిని వాయిదా వేసుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు సాదబాలయ్య సోదరుడు సాద గోపాల్‌ రాజమణి దంపతుల కుమారుడు శ్రీను, అంజయ్య అమృత దంపతుల కుమార్తె జ్యోతి వివాహం ఆదివారం శంకర్‌పల్లిలో నిర్వహించాలని నెల రోజుల కిందట నిర్ణయించారు. కార్డులు సైతం ముద్రించి బంధువులు, స్నేహితులకు సైతం పంపిణీ చేశారు. అయితే ప్రస్తుత కరోనా ప్రభావ పరిస్థితుల దృష్ట్యా జనం ఎక్కువగా గుమిగూడే అవకాశముండే శుభకార్యాలు వాయిదా వేసుకోవాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుతో సామాజిక బాధ్యతగా భావించి  వైరస్‌వ్యాప్తికి తాము కారణం కాకూడదన్న ఉద్దేశ్యంతో సాదబాలయ్య, మాధవి దంపతులు వధువు తరఫు తల్లిదండ్రులతో సంప్రదించి పెండ్లి వాయిదా వేయాలని నిర్ణయించారు. పరిస్థితి కుదుటపడిన అనంతరం తిరిగి మరో ముహూర్తానికి వివాహ వేడుకలను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. 


logo