మంగళవారం 26 మే 2020
Hyderabad - Mar 30, 2020 , 02:29:31

కార్మికులకు అండగా ఉండాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కార్మికులకు అండగా ఉండాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో వేలాది మంది కార్మికులు  వివిధ పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో పని చేస్తున్నారని వారికి అండగా ఉండాల్సిన బాధ్యతపై మనందరిపై ఉందని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపల్‌ కార్యాలయంలో కార్మికులు, రైతులు, మున్సిపాలిటీ పాలకవర్గంతో వేర్వేరుగా  సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై నమ్మకంతో ఒడిశా, బీహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ర్టాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మహేశ్వరం తహసీల్దార్‌ జ్యోతి, సీఐ శంకర్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌,  చైర్మన్‌ మధుమోహన్‌ ,వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, వైద్య సిబ్బందికి మంత్రి సూచించారు.  సంతలను  సోమవారం నుంచి నిలిపి వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీవెంకట్‌ రెడ్డి, కౌన్సిలర్స్‌ సుమన్‌,రవినాయక్‌ , నాయకులు రాజు ముదిరాజ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌ , మాజీ ఎంపీపీ సురేశ్‌, ఇటుక బట్టీ సంఘం నాయకులు రాజేందర్‌ రెడ్డి, ఇటుక బట్టీల యాజమానులు తదితరులు పాల్గొన్నారు. 


logo