గురువారం 28 మే 2020
Hyderabad - Mar 30, 2020 , 00:00:31

నగర వ్యాప్తంగా కొనసాగిన సేవాకార్యక్రమాలు

నగర వ్యాప్తంగా కొనసాగిన సేవాకార్యక్రమాలు

 • ఖైరతాబాద్‌కు చెందిన శివలాల్‌ యాదవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం. మహేశ్‌ యాదవ్‌ నేతృత్వంలో 200 మంది నిరుపేదలకు టిఫిన్లు అందజేశారు.
 • ఇందిరానగర్‌కాలనీలో కార్మికులకు టు టెక్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, 16కేజీల పప్పులు, 32 లీటర్ల వంట నూనె, 6.5కేజీల కారం పొడిని అందజేశారు. 
 • సోమాజిగూడ డివిజన్‌లోని ఎంఎస్‌ మక్తాలో పలువురు పేదలకు పంజాగుట్ట పోలీసులు బియ్యం, పప్పులను పంపిణీ చేశారు.
 • 100 మంది వలస కార్మికులకు నారాయణగూడ, గాంధీ కుటీర్‌ బస్తీలో చేనేత ఫౌండేషన్‌ అధ్యక్షుడు కేశబోయిన శ్రీధర్‌ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
 • హిమాయత్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు మహ్మద్‌ సర్ఫరాజ్‌ వంటలు చేయించి పేదలకు అన్నదానం చేశారు.
 • శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 60 మంది అధికారులు, సిబ్బందికి రాజేందర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, సుదర్శన్‌, రాంరెడ్డి, సురేందర్‌రెడ్డి అనే రైతులు ఉచితంగా కూరగాయలు అందజేశారు.
 • మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు వీరప్రసాద్‌, రామ్మోహన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌, హారిక కలిసి పలు జంక్షన్లలో 500 మంది రోజువారీ కూలీలతో పాటు 200 మంది పేద కుటుంబాలకు 10కిలోల బియ్యంతో పాటు సరుకులు అందజేశారు. 
 • జీహెచ్‌ఎంసీ పరిధిలోని 42 గోశాలలకు రోజుకు 25 టన్నుల ఆకుకూరలు 1 తేదీ వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలంగాణ గోశాల ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షుడు మహేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. వివరాల కోసం 9394005600లో సంప్రదించాలని ఆయన కోరారు.
 • చందానగర్‌లోని సంకల్ప ఫౌండేషన్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ అమోయ్‌కుమార్‌ వంట సరుకులు పంపించారు. రెండు రోజులకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, ఇతర సామగ్రిని సిబ్బంది నిర్వాహకురాలు గుండ్ర రోజికి అందజేశారు. 
 • శేరిలింగంపల్లికి చెందిన దీపక్‌,ప్రకాశ్‌ రేషన్‌కార్డులేని నిరుపేదల కోసం  నిత్యావసర సరుకులను కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌కు అందించగా, ఆయన తన వంతుగా 2క్వింటాళ్ల బియ్యాన్ని కలిపి  ఓల్డ్‌ హఫీజ్‌పేట్‌, ఖానామెట్‌ తదితర ప్రాంతాల్లో పంపిణీ చేశారు.
 • హైదర్‌నగర్‌లో లాక్‌డౌన్‌తో పనులు కోల్పోయి ఇండ్లకే పరిమితమైన పంజాబ్‌ రాష్ర్టానికి చెందిన కార్మికుల కుటుంబాలకు శ్రీరామ్‌నగర్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్తలు కాలనీ ప్రజల తోడ్పాటుతో సుమారు 100 కుటుంబాలకు ప్యాకెట్ల రూపంలో భోజన పదార్థాలను ఎస్‌ఐ అక్షిత సూచన మేరకు పంపిణీ చేశారు. 


logo