శనివారం 30 మే 2020
Hyderabad - Mar 28, 2020 , 23:10:21

వలస కార్మికులకు సరుకులు అందజేస్తాం..

వలస కార్మికులకు సరుకులు అందజేస్తాం..

  • రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన కార్మికులకు స్వచ్ఛం ద సంస్థల సహకారంతో రాచకొండ పోలీసులు అండగా నిలబడ్డారు. బీహార్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి వచ్చిన వలసకార్మికులు లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి నుంచి ఎలాగైన సొం త రాష్ర్టాలకు వెళ్లాలని ప్రయత్నిస్తూ మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి నిత్యావసర సరుకులు అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన దాదాపు 200మందికి బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో వసతిగృహాలను స్వచ్ఛంద సంస్థల సహకారంలో ఏర్పాటు చేశామన్నారు. ఒడిశా, బీహార్‌కు చెం దిన కార్మికులు కూడా ఆందోళనకు గురికాకుండా ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉంటే వారికీ నిత్యావసర సరు కులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. వెళ్లడానికి ప్రయత్నిస్తే చెక్‌పోస్టుల వద్ద పట్టుకుని వెనక్కి పంపిస్తారని ఆయన స్పష్టం చేశారు. 

21 రోజులపాటు క్వారంటైన్‌...

క్వారంటైన్‌లో ఉన్నవారు తప్పనిసరిగా 21 రోజులపాటు అందులో ఉండాల్సిందేనని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ పేర్కొన్నారు. అంతే అందులో నుంచి తప్పించుకుని తిరిగితే వారిపై సెక్షన్‌ 188 ఐపీపీసీతోపాటు ఇతర క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. క్వారంటైన్‌ నుంచి తప్పించుకుని తిరుగుతున్న వారి సమాచారాన్ని డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌ 94906 17111 నంబర్‌కు అందించాలని విజ్ఞప్తి చేశారు.  ఆదేవిధంగా ఎల్బీనగర్‌లో తిరిగిన వారిని తిరిగి క్వారంటైన్‌లో చేర్చామని చెప్పారు. 


logo