శనివారం 30 మే 2020
Hyderabad - Mar 28, 2020 , 23:07:47

ఆత్మీయతవారధి.. వీడియో చాట్‌

ఆత్మీయతవారధి.. వీడియో చాట్‌

  • అందరికీ అనుసంధానంగా సోషల్‌ మీడియా l మనుషులు దూరంగా.. మనసులు దగ్గరగా..!!
  • స్కైప్‌, వీడియోకాలింగ్‌తో పలకరింపులు l  కరోనా జాగ్రత్తలతో వీడియోలు, పోస్టులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టెక్నాలజీతో పరుగులు పెట్టే కాలం ఇది. డిజిటల్‌ యుగానికి ప్రతిఒక్కరూ అలవాటుపడ్డారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సాంకేతికతతో బంధం పెంచుకున్నారు. అయితే ఈ మార్పు కర్ఫ్యూవేళ కలిసొచ్చింది. ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితులు ఉండడంతో ఆ కష్టాలను సాంకేతితకతో అధిగమిస్తున్నారు. బంధువుల పలకరింపుల నుంచి మొదలుకుని వస్తువుల విక్రయం వరకు ఆన్‌లైన్‌ సేవలను విరివిగా ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో టెక్నాలజీతో మనుషుల మధ్య దూరం తగ్గించుకుంటున్నారు. ఈ ఖాళీ సమయాన్ని స్నేహితులు, బంధువులు, దూరప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడానికి కేటాయిస్తున్నారు. 

వీడియో కాలింగ్‌తో..!!

దేశమంతా కర్ఫ్యూ వాతావరణం ఉండడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. కొంతమంది ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. మరికొందరూ పట్టణాలకు వచ్చారు. అనూహ్య సంఘటనలతో కర్ఫ్యూ పొడిగింపు జరిగింది. అయితే చాలామంది డిజిటల్‌ వినియోగంతో కుటుంబానికి దూరంగా ఉన్నామనే బాధను మరిచిపోతున్నారు. వీడియో కాలింగ్‌, స్కైప్‌తో రోజుకు పదిసార్లయిన మాట్లాడుకుంటున్నారు. అత్యవసర కార్యాలయాలకు వెళ్లేవాళ్లు సైతం..యోగక్షేమాలను వీడియో కాలింగ్‌ చేసి కుటంబ సభ్యులు తెలుసుకుంటున్నారు. కర్ఫ్యూకు మందు సాధారణ కాలింగ్‌తో సంభాషించేవాళ్లు.. ప్రస్తుతం వీడియోకాలింగ్‌తో మేమున్నామని భరోసా పంచుకుంటున్నారు. అంతేకాదు డబ్బులకు ఇబ్బంది కలగకుండా గూగుల్‌పే, ఫోన్‌పే తదితర యాప్‌లతో పంపించుకుంచున్నారు. జాగ్రత్తలు చెప్పుకుంటూ ప్రేమా, ఆప్యాయతలను పంచుకుంటున్నారు.  

ఎంజాయ్‌ అంతా అందులోనే..!!

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌ తదితర యాప్‌ల్లోనే నెటిజన్లు ఎంజాయ్‌మెంట్‌ను వెతుక్కుంటున్నారు. ఇంటి నుంచి బయటకువెళ్లే మార్గం లేకపోవడంతో అధిక సమయం సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. యూ ట్యూబ్‌లో సినిమాలు.. కామిడీ ప్రోగ్రాంలు వీక్షిస్తున్నారు. సెల్‌ఫోన్‌, టీవీలతోనే వారు కాలక్షేపం చేస్తున్నారు. మొత్తంగా టెక్నాలజీ ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడమే కాదు.. అవసరమయ్యే సమాచారాన్ని అందిస్తూ వారికి అండగా నిలవడంలో కీలకపాత్ర వహిస్తుంది. అక్కడక్కడ కొన్ని ఫేక్‌ వార్తలు ప్రచారం విరివిగా ఉన్నా.. వాటిని ఫేక్‌ అని తేల్చడంలో కూడా సోషల్‌ మీడియా ఉపయోగపడుతుంది.  


logo