ఆదివారం 31 మే 2020
Hyderabad - Mar 28, 2020 , 23:02:11

అవాస్తవాలు ప్రచారం చేస్తే కేసులే

అవాస్తవాలు ప్రచారం చేస్తే కేసులే

  • కలెక్టర్‌ శ్వేతా మహంతి

హైదరాబాద్‌లోని ఏ ప్రాంతాన్ని కూడా రెడ్‌ జోన్‌గా ప్రకటించలేదని జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి స్పష్టం చేశారు. ఫిలింనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, రెడ్‌జోన్‌గా ప్రకటించారంటూ మార్ఫింగ్‌ చేసిన ఫ్లెక్సీలను సోషల్‌మీడియా, వెబ్‌సైట్లలో పోస్టు చేయడంపై దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన కలెక్టర్‌.. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేదిలేదని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.  రంగారెడ్డిలోనూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని ఆ జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వెల్లడించారు.

-సిటీబ్యూరో/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


logo