గురువారం 04 జూన్ 2020
Hyderabad - Mar 28, 2020 , 22:58:31

రాచకొండలో 800 పాస్‌పోర్టులు సీజ్‌

రాచకొండలో 800 పాస్‌పోర్టులు సీజ్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన 800 మంది పాస్‌పోర్టులను సీజ్‌ చేసినట్లు సీపీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. ఎవరికైనా అత్యవసరమైనప్పుడు పోలీసుల సహకారం కోసం కరోనా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9490 617234కు సమాచారం అందించాలన్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,989 మంది కరోనా అనుమానితులను గుర్తించగా,  1,740 మందిని వ్యక్తిగతంగా పరిశీలించామన్నారు. ఇందులో ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని, మిగతా 1,664 మంది క్వారంటైన్‌లో ఉన్నారని సీపీ వివరించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 29 క్రిమినల్‌, 36 పెట్టీ కేసులు పెట్టామని, 33 ద్విచక్రవాహనాలు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.


logo