ఆదివారం 31 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 22:58:46

అందరికీ అందుబాటులో..

అందరికీ అందుబాటులో..

  • నిరాటంకంగా.. సరుకుల సరఫరా..
  • నగరంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు
  • సమస్య వస్తే పోలీసులను సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌
  • పాసుల దరఖాస్తులకు త్వరలో కొత్త విధానం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రజలంరికీ అందుబాటులో నిత్యావసర సరుకులు ఉండేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతో నగరంలో నిరాటంకంగా నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయి. నిత్యావసరాల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడకుండా, ఆయా వస్తువులతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు జాయిం ట్‌ సీపీ అవినాష్‌ మహంతి నేతృత్వంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దాంతో పాటు తాజాగా శుక్రవారం నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎక్కడ కూడా ఇబ్బందు లు ఏర్పడకుండా, ఎవరికైనా సమస్య వస్తే వెంటనే పోలీసులను సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 24/7 హెల్ప్‌లైన్‌ పనిచేస్తుందని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఎవరైనా నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-23434343కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు హెల్ప్‌లైన్‌ను సీపీతో పాటు అదనపు సీపీ శిఖా గోయెల్‌, జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి సందర్శించారు.  

ఎలక్ట్రానిక్‌ పాస్‌ సిస్టమ్‌..

నిత్యావసర వస్తువుల సరఫరాచేసే వారికి పోలీసులు పాసులు జారీ చేస్తున్నారు. ఈ పాస్‌ల కోసం [email protected], వాట్సాప్‌ నంబర్‌ 9490616780లు అందుబాటులోకి తెచ్చింది. మూడు రోజుల వ్యవధిలోనే 9500 మంది పాసుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సుమారు 3600 పాసులు జారీ అయ్యాయి. పాసుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా ఎలక్ట్రానిక్‌ మోడ్‌లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌లలో ఒక లింక్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేసి వ్యాపారులు తమకు పాసు కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఒకటి రెండు రోజుల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాసులకు వస్తు న్న దరఖాస్తులను స్క్రూటీనీ చేసి, అవసరమైన వారందరికీ పాసులు జారీ చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు ..

  • నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయం 
  • టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి .. ఆరుగురు వ్యాపారులు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని ఏ ర్పాట్లు చేసింది. అయినా కూడా కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్క్‌లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అధిక ధరలకు విక్రయించే దుకాణాలపై నిఘా వేశారు. ఈ మేరకు రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు అతిక్రమించిన వా రిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 6 మందిని అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్డులోని వివేక్‌ అగర్వాల్‌ నిర్వ హిస్తున్న అమర్‌ ఇండియా మెడికల్‌ సర్జికల్‌ కంపెనీలో శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తుండడంతో నిర్వాహకుడిని అరెస్ట్‌ చేసి.. 32 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ రోడ్డులో జైహనుమాన్‌ ట్రేడర్స్‌ అండ్‌ కిరాణ, డ్రై ఫ్రూట్స్‌ షాప్‌ నిర్వాహకుడు బుద్ద అంజయ్యను అరెస్ట్‌చేసి..  32 కిలోల చింతపండును స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్‌ బోయిన్‌పల్లి హస్మత్‌పేట్‌లోని శివ తేజ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు యెర్రం స్కందకుమార్‌ను అరెస్ట్‌ చేసి.. పప్పులు , నూనెలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గు రు వ్యాపారులను ఆయా పోలీస్‌స్టేషన్లకు తదుపరి వి చారణ నిమిత్తం అప్పగించారు. వీరితో పాటు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు చిరు వ్యాపారులు శివశంకర్‌, చాలపబావిలో వీరమ్మ రాజు, రెజిమెంటల్‌ బజార్‌లో ఎస్‌.సందీప్‌లను అరెస్ట్‌ చేసి గోపాలం పురం పోలీసులకు అప్పగించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు శ్రీకాంత్‌, రాజశేఖర్‌రెడ్డి, పరమేశ్వర్‌ తదితర సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధకిషన్‌రావు  మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు  విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


logo