ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 00:14:44

పదివేల మందికి పద్మారావు భోజనం

పదివేల మందికి పద్మారావు భోజనం

  • డిప్యూటీ స్పీకర్‌  దాతృత్వం
  • లాక్‌డౌన్‌ ముగిసే  వరకూ సొంత ఖర్చులతో ఏర్పాటు

సికింద్రాబాద్‌ ,నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో రోజు పది వేల మందికి అన్నదానం చేస్తామని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ తెలిపారు. లాక్‌డౌన్‌ రద్దు చేసే వరకు  ప్రతి రోజు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భోజనం అందజేస్తామని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం చిలకలగూడ, పార్సిగుట్ట తదితర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కడుపునింపడం కోసం తెలంగాణ ప్రభుత్వం  అనేక పథకా      అమలు చేస్తుం దని, తనవంతుగా పేద ప్రజల కడుపునింపడం కోసం ప్రయత్నిస్తున్నానని వివరించారు. అవసరమైతే ఎంతమందికైనా అన్నదానం చేస్తానని తెలిపారు. చిలకలగూడ, వారాసిగూడ, పార్సిగుట్ట, మాణికేశ్వరినగర్‌లలో  ముందుగా అన్నదానం జరపాలని నిర్ణయించి ప్రారంభించామన్నారు. మరికొన్ని చోట్ల నుంచి అభ్యర్థనలు వస్తున్న దృష్ట్యా అక్కడ కూడా అన్నదానం చేస్తామని వివరించారు.

అప్పటికప్పుడు.. 

ప్రతిరోజు పదివేల మందికి అన్నదానం చేయడం కోసం వంటచేసి అన్నదాన పాయింట్ల వరకు వాహనాల్లో చేర్చడం కోసం ఒక సంస్థకు  అప్పగించారు. గురువారం  మొదటి రోజు కావడంతో ఎందరు వస్తారో తెలియని సందేహంతో 5వేల మందికి బోజనం పంపాలని నిర్ణయించి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అడ్వాన్స్‌ కూడా చెల్లించారు. అయితే ఆ సంస్థ నిర్వాహకుల కేవలం 12 వందల మందికి మాత్రమే భోజనాలు సిద్ధం చేసి పంపారు.  అప్పటికప్పుడు డిప్యూటీ స్పీకర్‌ మరో మూడు వేల ఐదు వందల మందికి క్యాటరింగ్‌కు అప్పగించారు.  గంట సమయంలో క్యాటరింగ్‌ యజమాని 3500 మందికి భోజనాలు సిద్ధం చేసి పంపించారు.


logo