శనివారం 30 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 00:33:25

మరింత పకడ్బందీగా..

మరింత పకడ్బందీగా..

 • లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం చేసిన పోలీసులు
 • ఇండ్లకే పరిమితమైన ప్రజలు
 • నిర్మానుష్యంగా రహదారులు

నగరంలోని పలు నియోజకవర్గాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నది. పోలీసులు నిబంధనలను కఠినంగా అమలుపరుస్తున్నారు. దీంతో బుధవారం రోడ్డన్నీ నిర్మానుష్యంగా కన్పించాయి. పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆయా ప్రాంతాల్లో  పర్యటించి ప్రజలను బయటకు రావద్దని కోరారు. పలుచోట్ల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

- నమస్తే తెలంగాణ, జోన్‌బృందం

కంటోన్మెంట్‌..

 • సికింద్రాబాద్‌, క్లాక్‌టవర్‌, బేగంపేట-సికింద్రాబాద్‌ రహదారిపై అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అష్టదిగ్బంధనం చేశారు.
 • రాజీవ్‌ రహదారి, మేడ్చల్‌ హైవేలపై సైతం పోలీసులు వాహనదారులను కట్టడి చేశారు.
 • ఆంక్షలు పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.
 • బోయిన్‌పల్లి, పికెట్‌, బాలంరాయి, రసూల్‌పుర, మహేంద్రహిల్స్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌,జూబ్లీబస్టాండ్‌, బొల్లారం, లాల్‌బజార్‌, తిరుమలగిరి, తాడ్‌బండ్‌, సెంటర్‌పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, మారేడ్‌పల్లి, రెజిమెంటల్‌బజార్‌ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
 • బుధవారం డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోండా డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల రూప  పర్యటించి కరోనా వైరస్‌ పై అవగాహన కల్పిస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా పలువురు పోలీసు సిబ్బందికి ఆహారాన్ని అందించారు. 
 • కరోనా వైరస్‌ నివారణకు విధులు నిర్వహిస్తున్న కంటోన్మెంట్‌ బోర్డు పారిశుధ్య కాంట్రాక్ట్‌ సిబ్బందికి పాలక మండలి మాజీ  ఉపాధ్యక్షుడు జంపనప్రతాప్‌ అండగా నిలిచారు.   సిబ్బందికి అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.     

బంజారాహిల్స్‌..

నిత్యావసర వస్తువులను అందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌

 • ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కాజా సూర్యనారాయణ, మన్నె కవితారెడ్డి సమక్షంలో పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. 
 • లాక్‌డౌన్‌ను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న 12 మందిపై కేసులు నమోదు చేసి 12 వాహనాలను సీజ్‌ చేసినట్లు నారాయణగూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ కృష్ణంరాజుతెలిపారు.
 • ఖైరతాబాద్‌ డివిజన్‌ నవీన్‌ నగర్‌కాలనీ, హిల్‌ టాప్‌ కాలనీ, సీఐబీ క్వార్టర్స్‌  వద్ద యూఎస్‌, చికాగోల నుంచి వచ్చిన హోం క్వారంటైన్‌ బాధితులను కార్పొరేటర్‌ పి. విజయా రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఏఎంవో డాక్టర్‌ భార్గవ్‌ నారాయణ కలిసి ఎస్‌ఎఫ్‌ఏల సాయంతో అవసరమైన నిత్యావసర సరుకులు, మంచినీరు తెప్పించారు.

అమీర్‌పేట్‌..

 • సనత్‌నగర్‌ పరిసరాల్లో బుధవారం ఉదయం నుంచి జీహెచ్‌ఎంసీకి చెందిన రెండు జెట్టింగ్‌ యంత్రాలతో ఖైరతాబాద్‌ సర్కిల్‌ ప్రధాన రహదాలపై స్ప్రే చేయించారు.
 • జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ విభాగం ఎమర్జెన్సీ అధికారి మహ్మద్‌ సర్దార్‌ పర్యవేక్షణలో సనత్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌ పరిసరాల్లో రెండు జెట్టింగ్‌ స్ప్రే యంత్రాలు పని చేశాయి.
 • ఒక్కో యంత్రానికి 8 మంది చొప్పున మొత్తం 16 మంది బుధవారం ఉదయం నుంచి అన్ని ప్రధాన రహదారులపై పిచికారీ చేశారు. 
 • సనత్‌నగర్‌ కార్పొరేటర్‌ కోలన్‌ లక్ష్మీరెడ్డి, అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, బేగంపేట్‌ కార్పొరేటర్‌ ఉప్పల తరుణిలు డివిజన్లలోని ప్రధాన రహదారులపై పర్యటించి రోడ్లపై తిరుగుతున్నవారిని హెచ్చరించి ఇండ్లకు తిప్పి పంపారు. 

  అంబర్‌పేట.. 

 • కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తెలంగాణ లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ స్పష్టంచేశారు. 
 • బుధవారం బాగ్‌అంబర్‌పేట, గోల్నాక డివిజన్‌లలోని పలు బస్తీల్లో పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. 
 • కూరగాయలను అధిక ధరలకు విక్రయించవద్దని వ్యాపారులకు చెప్పారు. 
 • టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దుర్గాప్రసాద్‌రెడ్డి,  కార్యకర్తలతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. 
 • ‘సీఎం కేసీఆర్‌ సూచించిన ఆదేశాలను పాటిద్దాం.. ప్రాణాలను కపాడుకుందాం’ అని  టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు ఎక్కాల కన్నా, అధ్యక్షుడు కిట్టు, మున్నాసింగ్‌  కాచిగూడ, బర్కత్‌పుర, నారాయణగూడ, చెప్పల్‌బజార్‌, కుద్భిగూడ, మానిర్‌పట్టి, నింబోలిఅడ్డాలో పర్యటించి మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. 

ముషీరాబాద్‌..

 • కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మూడో రోజు కొనసాగింది. 
 • పోలీసులు ప్రజలు రోడ్లపైకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. 
 • విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారికి వైద్యలు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. వారు నివాసముంటున్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. బ్లీచింగ్‌ పౌడర్‌, రసాయనాలు చల్లారు
 • రంగంలోకి దిగిన ఎమ్మెల్యే, డిప్యూటీమేయర్‌ 

జూబ్లీహిల్స్‌..

 • జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, నగర డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును పరిశీలించారు. 
 • ఎర్రగడ్డ రైతుబజార్‌లో పండ్లు, కూరగాయల ధరలపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆరా తీశారు. అధిక ధరలకు విక్రయించరాదని వ్యాపారులకు సూచించారు.
 • విధుల్లో ఉన్న పోలీస్‌లు, బల్దియా సిబ్బంది, కార్మికులకు బాబా ఫసియుద్దీన్‌ బోరబండ తుర్రెబాజ్‌ఖాన్‌ కమ్యూనిటీహాల్లో ఆహారాన్ని సమకూర్చారు. 
 • నమాజు వేళల్లో ఇమామ్‌, మోజన్‌లతో పాటు మరో ఇద్దరు మసీదులో ఉంటే సరిపోతుందని మిగతా ముస్లింలు ఇండ్లలోనే నమాజు చేయాలని బాబా ఫసియుద్దీన్‌ సూచించారు. 
 • యూసుఫ్‌గూడ డివిజన్‌ బస్తీల్లో చేపట్టిన రసాయనాల పిచికారీని బుధవారం కార్పొరేటర్‌ గుర్రం సంజయ్‌గౌడ్‌, వార్డు కమిటీ సభ్యురాలు గీతాగౌడ్‌ పరిశీలించారు.  

కార్వాన్‌..

 • కరోనా వ్యాధి భారిన పడుకూండా జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం జియాగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ మిత్రకృష్ణ, కార్వాన్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ఠాకూర్‌ జీవన్‌సింగ్‌  పురానాపూల్‌ చౌరస్తాలో ప్రజలకు అవగాహన కల్పించారు.    
 • వాహనదారులకు ఎన్ని సార్లు చెప్పినా వినకపోడంతో  పోలీసులు పురానాపూల్‌ చౌరస్తా నుంచి జియాగూడకు వెళ్లే ప్రధాన రహదారి, కార్వాన్‌ రోడ్లను బారికేడ్లతోమూసి వేశారు. 
 • ప్రజలు కరోనాను తరిమికొట్టడానికి ఇండ్లల్లో నుంచి బయటకు రాకుండా  ఉండాలని  కార్వాన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్‌ టోలిచౌకిలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి  అవగాహన  కల్పించారు. 

సికింద్రాబాద్‌ ..

 • మాణికేశ్వరినగర్‌లో బయట  తిరుగుతున్న ప్రజలకు తార్నాక డివిజన్‌ కార్పొరేటర్‌ సరస్వతి అవగాహన కల్పించారు. 
 • సీతాఫల్‌మండిలో మూడు అడుగులకు ఒకరు చొప్పున  క్యూలో నిలబడేలా చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్‌ దుకాణదారులకు అవగాహన కల్పించారు. 
 • కూరగాయల ధరలు పెంచి అమ్మితే చర్యలు తీసుకుంటామని చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి హెచ్చరించారు. 
 • ఒక గ్యాస్‌ కంపెనీ యజమాని సిలిండర్లను ఇండ్లకు పంపకుండా ఒకచోట నిలువచేసి వినియోగదారులను రప్పిస్తుండడంతో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కార్యాలయం సిబ్బంది మరోసారి ఇలాంటివి జరిగితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


logo