శనివారం 30 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 00:18:20

‘కరోనా’ విధుల్లో ప్రజాప్రతినిధులు

‘కరోనా’ విధుల్లో ప్రజాప్రతినిధులు

  • ఇంట్లోనే ఉండాలని సూచన
  • సామాజిక దూరం  పాటించాలని వినతి
  • మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే..
  • దయచేసి చెబుతున్నాం.. బయటకు రావొద్దు
  • మీకు కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వం కల్పిస్తుంది
  • వీధులు, రోడ్లపైకి వచ్చి ప్రజల్లో విస్తృత అవగాహన 
  • ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని వినతి కరోనా కట్టడికి గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు బుధవారం నుంచి ‘కరోనా’ డ్యూటీ ఎక్కారు. వీధులు, కాలనీలు, రోడ్లపైకి వచ్చిన ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించే సమయం మీ చేతుల్లో ఉందంటూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. దయచేసి చెప్తున్నాం.. ప్రజలు ఎవరూ తమ ఇండ్లను వదిలి బయటకు రావొద్దంటూ అభ్యర్థించారు. మీకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఒకవేళ వస్తే కఠినంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


logo