మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 26, 2020 , 00:06:11

పటిష్టం.. లాక్‌డౌన్‌

పటిష్టం.. లాక్‌డౌన్‌

  • ఆ దిశగా పోలీసులు చర్యలు
  • అడుగడుగునా నిఘా...
  • ప్రజలు రోడ్లెక్కవద్దు.. ఇండ్లలోనే ఉండాలంటూ సూచన
  • అనవసరంగా రోడ్డెక్కేవారిపై కేసులు, వాహనాలు సీజ్‌
  • సీసీసీ నుంచి పర్యవేక్షణ..
  • టెక్నాలజీతో విజయవంతానికి కృషి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా రు. ఆ దిశగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నా రు. నగరంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి తెలుసుకుని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి.. తమ వంతు కృషిగా ఇండ్లకే పరిమితం కావాలంటూ నగర పోలీసులు సూచిస్తున్నారు. కరోనా అనే మహమ్మారి నుంచి మనకు మనం కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం సోష ల్‌ డిస్టెన్స్‌ అంటూ ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా కొందరిలో మాత్రం మార్పు రా వడం లేదు. బుధవారం ఉదయం చాలామంది బయటకు వచ్చారు.. అయితే నిత్యావసర వస్తువులు, పండుగ సామగ్రి కొనే సమయంలో ఒకరికొకరు కొద్ది దూరంగా ఉండాలనే ఆలోచన కూడా చాలా చోట్ల చేయలేదు. పోలీసులు ఎంత కఠినంగా వ్యహారిస్తే.. అంత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలవుతుందంటూ ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైంది. జనాలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ప్రతి కూడలితో పాటు రద్దీగా ఉండే ప్రాంతా ల్లో  నిఘాను ఏర్పాటు చేశారు. దీనికితోడు కమిషనర్‌ కార్యాలయంలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ (సీసీసీ) సేవలను  ఉపయోగించుకుంటున్నారు. నగరంలో ర్యా లీలు, సభలు, సమావేశాలు ఊరేగింపుల సమయంలో సీసీసీ నుంచి పోలీసులు పర్యవేక్షిస్తూ .. ఆయా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేసేందుకు పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నా రు. ఇందులో భా గంగా సీసీసీ నుంచి నిరంతరం కాలనీలు, బస్తీలు, ప్రధాన రోడ్లపై నిఘాను మరింత పటి ష్టం చేశారు. హైదరాబాద్‌ పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తూ లాక్‌డౌన్‌ను ప్రజలందరూ విజయవంతం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

బయటతిరిగేవారికి కౌన్సెలింగ్‌, కేసులు

నగరమంతా నిర్మానుష్యం గా ఉండాల్సిన అవసరమున్నది. అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ విభాగా లు, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే దుకాణాలకు తప్ప మిగతావన్నీ మూసివేయాలి. నిత్యావసర వస్తువులకు ఎలాంటి సమ స్య ఉండదు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని కొనేందుకు వెసులుబాటు ఉంటుందంటూ ప్రభుత్వం చెబుతున్నా.. చాలామంది ఉదయం వేళల్లోనే మార్కెటకు పోటెత్తుతున్నారు. దీంతో పోలీసులు ప్రజల్లో అవగాహన కూడా తెస్తున్నారు. మరో పక్క క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి తెలుసుకుంటున్నారు. సీసీ కెమెరాల నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటే అక్కడకు వెంటనే సిబ్బందిని పంపిస్తున్నారు. రద్దీకి గల కారణాలను సిబ్బంది తెలుసుకుంటూ, అనవసరంగా బయట తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్‌ చేయ డం, కేసులు నమోదు చేస్తూ వాహనాలను కూడా సీజ్‌ చేస్తున్నారు. 


logo
>>>>>>