ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 24, 2020 , 00:07:02

మీ కోసమే లాక్‌ డౌన్‌.. ఇంట్లోనే ఉండండి..

మీ కోసమే లాక్‌ డౌన్‌.. ఇంట్లోనే ఉండండి..

రవాణాపై ఆంక్షలు...

ఇతర రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దులు మూసివేత.

నిత్యావసర వస్తువులు, చెడిపోయే పదార్థాల రవాణాకు పోలీస్‌ తనిఖీల తర్వాత అనుమతి ఉంటుంది. 

రోడ్లపై టీఎస్‌ఆర్టీసీ, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు రిక్షాలు తిరుగడానికి అనుమతి లేదు.

పౌరులు తిరుగడంపై..

 • రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటలకు వరకు రోడ్లపై ఎవరూ కనిపించవద్దు. ఈ నెల 31 వరకు అమల్లో ఉంటుంది.
 • హోం క్వారంటైన్‌ను ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. బయట తిరిగితే కఠిన చర్యలు.
 • పౌరులు ఇండ్ల నుంచి బయటికి రావద్దు. నిత్యావసర కొనుగోలు కోసం బయటికి వచ్చినా సామాజిక దూరం కనీసం 3 నుంచి 6 ఫీట్లు పాటించాలి.
 • ఐదుగురు, అంతకు మించి రోడ్లపై తిరుగరాదు.
 • రోడ్లపై సెల్ఫీలు తీసుకున్న కేసులు నమోదు

వాణిజ్య సముదాయాలపై..

 • దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలు,  కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, వర్క్‌ షాపులు, గోడౌన్‌లు అన్ని మూసివేయాలి.
 • ఫార్మా రంగానికి సంబంధించిన మందులు తయారు చేసే సంస్థలకు షరతులతో కూడిన  మినాహాయింపు ఉంటుంది. 
 • బియ్యం, పప్పులు, భోజనానికి సంబంధించిన వస్తువులు, పాలు తదితర వస్తువులను విక్రయించే దుకాణాలు తెరిచి ఉంచవచ్చు.
 • బ్యాంక్‌లు, ఏటీఎంలు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ, ఐటీఈఎస్‌, నిత్యావసరాల సరఫరాకు సంబంధించిన వాటికి అనుమతి ఉంటుంది. 
 • భోజనం, పండ్లు, పాలు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు తరలించే వారికి అనుమతి ఉంటుంది.
 • టేక్‌ అవే, హోం, ఈ కామర్స్‌ డెలివరీ చేసుకోవచ్చు.

మూడు కమిషనరేట్ల పరిధిలో తీసుకుంటున్న చర్యలు

 • అన్ని సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు విస్తృత తనిఖీలు.
 • ట్రాఫిక్‌, శాంతి భద్రతల పోలీస్‌లు సంయుక్తంగా చెక్‌పోస్టులను నిర్వహిస్తారు.
 • అనుమతి ఉన్న రెస్టారెంట్స్‌, ఫుడ్‌ డెలివరీ ఏజెన్సీలు రాత్రి 7 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. 
 • ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై అనవసరంగా తిరిగితే కఠిన చర్యలు.

ప్రజలకు సూచనలు

 • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళికను రూపొందించుకోవద్దు. 
 • లాక్‌ డౌన్‌ ఉన్నంత కాలంలో ప్రజలు ఇండ్ల వద్దనే ఉండాలి. స్వీయ క్రమశిక్షణ పాటించాలి.
 • విదేశాలకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా అధికారులకు తెలిపి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
 • లాక్‌ డౌన్‌ ఆంక్షలు ఉన్నంత కాలం ఆటో రిక్షాలు నడుపొద్దు. రోడ్డు మీద కనపడితే సీజ్‌.
 • ఓలా, ఊబర్‌ సంస్థలు బంద్‌ చేసుకోవాలి.
 • ఒగో, బౌన్స్‌, జూమ్‌ కార్‌, ర్యాపిడో సంస్థలు వాహనాలను అద్దెకు ఇవ్వొద్దు.
 • ఫంక్షన్‌ హాలు, హోటల్‌ ఇతర సముదాయాలు పబ్లిక్‌ ఒక్క దగ్గరకు చేరే కార్యక్రమాలు నిర్వహించరాదు.
 • అనుమానాలు ఉంటే హెల్ప్‌ లైన్‌ నంబర్లు 18004255 0817కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌లో పోలీస్‌, రెవెన్యూ, వైద్య అధికారులు అందుబాటులో ఉంటారు. అదే విధంగా కరోనా పాజిటీవ్‌లు, లేదా అకతాయిలు నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరిగితే ఆ సమాచారాన్ని డయల్‌ 100 ద్వారా అందించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 040-23230811/813/814/817కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. 


logo