ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 24, 2020 , 00:04:43

2,829 వాహనాలు సీజ్‌

2,829 వాహనాలు సీజ్‌

  • ట్రైకమిషనరేట్‌ల పరిధిలో తనిఖీలు

లాక్‌డౌన్‌ పాటించని వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రైకమిషనరేట్ల పరిధిలో సోమవారం మొత్తం 2,829 వాహనాలు సీజ్‌ చేశారు. హైదరాబాద్‌ పరిధిలో 2480, సైబరాబాద్‌ పరిధిలో 244, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో105 వాహనాలు సీజ్‌ చేశారు. హైదరాబాద్‌లో  25 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 73 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 1058 ద్విచక్ర వాహనాలు, 948 ఆటోలు, 429కార్లు, 45 ఇతర వాహనాలు  సీజ్‌చేశారు. ఏమైనా ఫిర్యాదులుంటే కంట్రోల్‌ రూమ్‌ నంబరు 040-27852482, హెల్ప్‌లైన్‌ నంబరు- 9010203626కు ఫోన్‌చేయాలని పోలీసులు సూచించారు. రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఏ వాహనం బయట తిరగొద్దని హెచ్చరించారు. అలాగే రాచకొండ పరిధిలో  మోటర్‌ సైకిళ్లు-3, ఆటోలు-88, కార్లు-14 సీజ్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోఆటోలు-182, కార్లు-13, ఆటోలు-49 సీజ్‌ చేశారు.


logo