మంగళవారం 07 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 24, 2020 , 00:02:03

లాక్‌డౌన్‌ ఎందుకంటే..!

లాక్‌డౌన్‌ ఎందుకంటే..!

అతడికి కరోనా వైరస్‌ సోకింది.. కానీ

పద్నాలుగు రోజుల వరకు అతడికి తెలియదు..

ఆరోగ్యంగానే ఉన్నాననుకుంటూ

రోజుకు పది మందికి అంటిస్తాడు..

ఆ పది మంది మేము ఆరోగ్యవంతులమేననుకుని

బయట తిరుగుతూ వంద మందికి అంటిస్తారు.

ఈ వంద మంది మాకేం కాలేదని

మరో వెయ్యి మందికి వైరస్‌ సోకిస్తారు.

వీరిలో ఎవరు వ్యాధి గ్రస్తులో.. 

ఎవరు ఆరోగ్యవంతులో ఎవరికీ తెలియదు

కానీ.. ఇతరులకు వైరస్‌ అంటిస్తూనే ఉంటారు.

ఇప్పుడు అర్థమయ్యిందా..

ఇంట్లోనే ఎందుకు ఉండాలంటున్నారో..

ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం

స్వీయ నిర్బంధం విధించుకుందాం

ఎప్పటికప్పుడు శుభ్రత పాటిస్తూ

కొవిడ్‌19ను తరిమికొడదాంlogo