బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 23, 2020 , 23:56:06

ఎక్కడికక్కడ ‘లాక్‌డౌన్‌'

ఎక్కడికక్కడ ‘లాక్‌డౌన్‌'

  • అత్యవసర దుకాణాలకు అనుమతి
  • రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు కౌన్సెలింగ్‌

జోన్‌ బృందం: (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గోషామహల్‌, ఉప్పల్‌ నియోజకవర్గాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు స్వీయ నిర్భందం విధించుకున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి, మాదాపూర్‌ ఐటీ కారిడార్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఐటీ ఉద్యోగులు  విధులను ఇంటి నుంచే నిర్వర్తించారు. అలాగే కొన్ని ప్రధాన ప్రాంతాల్లో కిరాణా , కూరగాయల దుకాణాలు, పాలకేంద్రాలు తెరుచుకోవడంతో ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. కొన్ని చోట్ల రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను  పోలీసులు అడ్డుకొని అవగాహన కల్పించారు. అత్యవసరం అయితే తప్ప వాహనాలతో రహదారులపైకి రాకూడదని, ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పా టు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వంశీమోహన్‌ అవసరమైన మాస్క్‌ లు, బెడ్‌షీట్లు, వాటర్‌ ప్యాకెట్లు, రెవెన్యూ సిబ్బందికి పంపిణీ చేశారు.  చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో కోవిడ్‌ 19 ప్రత్యేక బృందాలతో ఉపకమిషనర్‌ సుధాంశ్‌ నందగిరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  కాగా ఆది సోమ వారాల్లో సర్కిల్‌ కోవిడ్‌ బృందాలు మొత్తం 336 మందిని ఆరా తీయగా ఒక్కరికి మాత్రం కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించినట్టు గుర్తించి, ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. చేతిపై స్టాంప్‌ కలిగిన వారు 14 రోజుల పాటు తప్పని సరిగా స్వీయ నిర్భందంలో ఉండాలని సూచించారు.

విదేశాల  నుంచి వచ్చిన కుటుంబాల గుర్తింపు 

 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆర్‌జీఐఏ సీఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విమానయాన ప్రయాణికుల పాస్‌పోర్టులు తనిఖీ చేశారు. మండలంలోని పెద్దగోల్కొండ జర్మనీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్వీయ నిర్భంధంతో తన వ్యవసాయ క్షేత్రంలో 15 రోజులుగా ఉండటంతో ఆయన వద్దకు  సర్పంచ్‌ లక్ష్మయ్య, పంచాయతీ అధికారులు వెళ్లి ఆరా తీశారు. కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్‌ చేస్తూ కొన్ని పరిశ్రమలు నడు స్తున్నాయి. ప్రతి పరిశ్రమలో దాదాపు 500 మంది వరకు కార్మికులు విధులలో పాల్గొం టున్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమి గూడ రాదని పదే పదే చెబుతుండగా పరిశ్రమల వారు మాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ సర్కిల్‌ పరిధిలోని మార్కండే యనగర్‌కు చెందిన మునగపాటిప్రవీణ్‌ యూరప్‌లో పని చేస్తుంటాడు. ప్రవీణ్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు.స్థానికుల సమాచారంతో అధికారులు ప్రవీణ్‌ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన తగిన జగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు. 

ఉస్మానియా దవాఖానలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న పూర్తి స్థాయి బంద్‌ లో దవాఖానలు విధులు నిర్వర్తించి వైద్య సిబ్బందికి రవాణాలో కలుగుతున్న ఇబ్బందిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. నాగేందర్‌ పేర్కొన్నారు. దవాఖానలో విధులు నిర్వహిస్తున్న రెండు వేల మంది స్టాఫ్‌ నర్సులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది దవాఖానకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్‌ పట్ల ఉస్మానియా వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్‌ సంద ర్భంగా ఈ సంవత్సరం శ్రీరామ నవమి శోభాయాత్రను  నిర్వహించడం లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 చర్లపల్లిలో స్వచ్ఛందంగా  పరిశ్రమల లాక్‌డౌన్‌

చర్లపల్లిలోని పరిశ్రమలు సోమవారం నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఉద్యో గులకు సెలవులిచ్చారు. చర్లపల్లి పరిశ్రామిక వాడలోని ఐలా చైర్మన్‌ కట్టంగూర్‌ హరీష్‌ రెడ్డి, ఫేజ్‌-3సీఐఏ అధ్యక్షుడు మియాపురం రమేశ్‌ కూడా ప్రస్తుత పరిస్థితులను వివరించి, ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. ప్రభు త్వం తీసు కున్న నిర్ణయాన్ని ఆటోయూనియన్‌ కూడా స్పందించింది. ఈనెల 31వ తేదీ వరకు బంద్‌ పాటించాలని  టీఆర్‌ఎస్‌కేవీ ఆటోయూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపు నిచ్చారు. ఉప్పల్‌లోని శ్రీరామచంద్రస్వామి ఆలయం మూసివేస్తున్నామని నిర్వా హకులు తెలిపారు. ఆలయంలో ఎలాంటి ఆర్జిత సేవలు నిర్వహించబడవని, ఉగాది రోజున పంచాగ శ్రవణం, దైవదర్శనం ఉండవన్నారు. ఉప్పల్‌లోని శ్రీరామచంద్రస్వామి ఆలయం మూసి వేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో ఎలాంటి ఆర్జిత సేవలు నిర్వహించబడవని, ఉగాది రోజున పంచాగ శ్రవణం, దైవదర్శనం ఉండవన్నారు. 


logo