శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 15:41:55

మన కోసం.. మరో 9 రోజులు లాక్‌డౌన్‌

మన కోసం.. మరో 9 రోజులు లాక్‌డౌన్‌

 • 31 వరకు లాక్‌డౌన్‌
 • అత్యవసర సేవలకు మినహాయింపు

కరోనా కట్టడి కోసం మనమూ చేయూతనిద్దాం.. ప్రభుత్వం పిలుపు మేరకు లాక్‌డౌన్‌లో భాగస్వామ్యమవుదాం. బయటికిరాకుండా.. బాధ్యతతో  వ్యవహరిద్దాం.. జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం. ఈ నెల 31 వరకు స్వీయ నిర్బంధాన్ని పాటిద్దాం. తొమ్మిదిరోజులనుకోకండి.. మధ్యలో ఉగాది పండుగ, ఆదివారం సెలవు రోజులే. మిగిలిన రోజుల్లో కష్టమనుకోకుండా.. సమాజహితం కోసం సహకరిద్దాం

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


మూతబడేవి..

 • ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, మెట్రోరైళ్లు,
 • ఎంఎంటీఎస్‌,  ప్రార్థనామందిరాలు, 
 • రైతుబజార్లు, సూపర్‌ మార్కెట్లు, 
 • షాపింగ్‌ మాల్స్‌, పార్కులు, పబ్బులు, రెస్టారెంట్లు, 
 • హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, సినిమా థియేటర్లు, క్షౌరశాలలు. పర్యాటక ప్రాంతాలు, మాంసం దుకాణాలు, వారాంతపు మార్కెట్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలు.

అందుబాటులో..

 • పాలు, పెరుగు, నిత్యావసరాలు
 • కూరగాయల దుకాణాలు, కిరాణాషాపులు
 • రేషన్‌షాపులు, గ్యాస్‌ సిలిండర్‌ ఏజెన్సీలు 
 • దవాఖానలు, అంబులెన్స్‌లు
 • మెడికల్‌షాపులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు
 • పెట్రోల్‌బంకులు, గ్యాస్‌స్టేషన్లు
 • విద్యుత్‌ సేవలు (సబ్‌స్టేషన్లు)
 • నీటి సరఫరా, సీవరేజీ నిర్వహణ 

ఇంట్లో ఇలా జాగ్రత్త..

 • బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను నేరుగా తాకకుండా చేతులకు శానిటైజ్‌ చేసుకొని పట్టుకోవాలి
 • పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లను  శుభ్రంగా కడిగి, చేతులనూ వాష్‌ చేసుకోవాలి
 • కొత్తవారిని, పనిమనుషులను ఇంట్లోకి అనుమతించకపోవడమే మంచిది
 • మొబైల్‌ ఫోన్లు, రిమోట్‌ కంట్రోల్‌, కీ బోర్డ్స్‌ తరచూ శుభ్రం చేసుకోవాలి 
 • అత్యవసరంగా బయటకు వెళ్లి వస్తే వెంటనే స్నానం చేయాలి 
 • వృద్ధులు వాకింగ్‌కు వెళ్లకపోవడమే మేలు


logo