మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 00:47:21

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

  • కరోనా వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదు
  • కట్టడికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు
  • ఆ ముగ్గురికి నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది.
  • మేడ్చల్‌ జిల్లా సర్వేలెన్స్‌ ఆఫీసర్‌ రామ్‌కుమార్‌

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 22 : కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని మేడ్చల్‌ జిల్లా సర్వోలెన్స్‌ ఆఫీసర్‌ రామ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-2లో కరోనా వైరస్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులను, కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులను కలసి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-2లో ఒకే ఇంటికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంలో ప్రభుత్వ ఆధీనంలోని కేంద్రంలో వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఆ వ్యక్తులు నివసించే అపార్ట్‌మెంట్‌, పరిసరాల్లో నివసిస్తున్న కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురికావడం తగదన్నారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలను వివరించామని, ఈ ప్రాంతంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. కాలనీ ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని ఎప్పటికప్పుడు సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. దగ్గు, జ్వరం వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించాలని ప్రతి వ్యక్తితో ఒక మీటర్‌ దూరాన్ని పాటించాలని, జనసమూహం ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ ఏఈ నగేశ్‌, మహేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆ ఇంటి పరిసరాలతో పాటు కాలనీలో ప్రత్యేక రసాయనాలను పిచికారి చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి చందర్‌, యాదగిరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

ముగ్గురు వ్యక్తులకు కరోనా నిర్ధారణ కాలేదు...

 కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-2లో నివసించే ఎం.రవీందర్‌, కె.మాధవి, కె.సురేశ్‌ లకు కరోనా పరీక్షల్లో నెగేటివ్‌ వచ్చిందని మేడ్చల్‌ జిల్లా సర్వోలెన్స్‌ ఆఫీసర్‌ రామ్‌కుమార్‌ ప్రకటించారు. గత రెండు రోజుల క్రితం వారిని గాంధీ వైద్యశాలకు తీసుకెళ్లి కార్వన్‌టైన్‌లో ఉంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కరోనా వ్యాధి లక్ష్యణాలు లేకపోవడంతో వారు త్వరలోనే ఆరోగ్యంగా బయటికి వస్తారన్నారు. కరోనా వైరస్‌ తమకు వ్యాపించిందేమోనని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కోరారు. 


logo
>>>>>>