గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 23, 2020 , 00:44:41

కరోనా కట్టడికి సమష్టిగా యుద్ధం

కరోనా కట్టడికి సమష్టిగా యుద్ధం

  • జనతా కర్ఫ్యూకు స్వచ్ఛందంగా ప్రజల మద్దతు
  • వ్యాపార సంస్థల మూసివేత
  • బోసిపోయిన రహదారులు 
  • వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా చప్పట్లు 

ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని మట్టుపెట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూలో భాగంగా స్వీయ గృహా నిర్బంధాన్ని ప్రజలందరు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా ఏకమై తమ బాధ్యతను నెరవేర్చారు. ప్రజలు బయటికి వెళ్లకుండా తమను తామే ఇండ్లల్లో నిర్భదించుకున్నారు. ఆలయాలకు తాళాలు వేశారు. వర్తక, వాణిజ్య వ్యాపారాలు, సినిమాహాళ్లు, హోటళ్లు, బేకరీలు, చికెన్‌, మటన్‌, వైన్‌షాపులతో సహా అన్ని మూత పడ్డాయి. కర్ఫూతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడు ట్రాఫిక్‌ జామ్‌లతో దర్శనమిచ్చే చౌరస్తాలు ఖాళీఖాళీగా కనిపించాయి. పోలీసులు ప్రదాన కూడళ్లలో పికెటింగ్‌లతో పాటు మిగతా ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.  కరోనా వైరస్‌ను నిర్మూలించే సేవలు చేస్తున్న డాక్టర్లకు, పారిశుధ్య కార్మికులు, మీడియా మిత్రులకు, పోలీసులను అభినందిస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ హర్షధ్వనాలు (చప్పట్లు) కొట్టి మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపి భారతదేశ ఐక్యతను చాటి చెప్పారు. 

- నమస్తే తెలంగాణ జోన్‌ బృదం


logo