శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 22, 2020 , 04:13:38

దేవుడా కరుణించు..

 దేవుడా కరుణించు..

అమీర్‌పేట్‌, నమస్తే తెలంగాణ  : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తులను అనుమతించని కారణంగా.. అప్పటికే తయారు చేసిన దాదాపు 5 వేల లడ్డూలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఆలయంలో ప్రవేశాన్ని నిలిపివేశారు. ఆలయ ఆవరణలో వేద పండితుల ఆధ్వర్యంలో  లోక కల్యాణార్థం గణపతి హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, నవగ్రహ హోమములను ఆలయ ఈవో ఎంవీ శర్మ, దేవాలయ చైర్మన్‌ కొత్తపల్లి సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ఎంవీ శర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు దేశ ప్రజలంతా ఐక్యతను చాటాలని ఆదివారం నాటి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరారు. 

 సనత్‌నగర్‌లో..

కరోనా వైరస్‌ వ్యాధి నివారణ కోసం సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవాలయంలో ఆయూష్య, ధన్వంతరీ హోమాలను నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమాల్లో కార్పొరేటర్‌ కొలన్‌ లక్ష్మీరెడ్డి దంపతులు పాల్గొన్నారు.  అర్చకులు రవీంద్రాచార్యులు, రిపుంజయ శర్మ, సుదర్శనాచార్యులు నిర్వహించారు. 

 -అమీర్‌పేట్‌, నమస్తే తెలంగాణ 


కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ ఆలయంలో..

 కరోనా మహమ్మారిని అరికట్టేలా దర్బార్‌ మైసమ్మ కరుణించాలని ప్రార్థిస్తూ జియాగూడ కార్పొరేటర్‌ మిత్ర కృష్ణ పూజలు నిర్వహించారు.  అమ్మవారి అనుగ్రహంతో  ఎలాంటి మహమ్మారినైనా అడ్డుకోవచ్చన్నారు. ముత్యాల భాస్కర్‌, చిరు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

-కార్వాన్‌


 చిలకలగూడలో.. 

మెట్టుగూడ డివిజన్‌ పరిధిలోని చిలకలగూడ చింతబావిలోని సీతారామాంజనేయ, సాయిబాబా, శివాలయంలో  టీఆర్‌ఎస్‌ నేత, ఇంద్రన్న ప్రజాసేవ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఇంద్ర ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరోనా వ్యాధి నివారణ కోసం ఇలాంటి యజ్ఞం జరుపడం హర్షించదగ్గ విషయమన్నారు. 

-సికింద్రాబాద్‌, నమస్తేతెలంగాణ 


logo