ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 22, 2020 , 04:08:31

అజాగ్రత్త వద్దు.. అప్రమత్తతే ముద్దు

అజాగ్రత్త వద్దు.. అప్రమత్తతే ముద్దు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌కు మన అప్రమత్తతే  అతిపెద్ద ఔషధం. మన నిర్లక్ష్యమే.. మన పాలిటశాపంగా పరిణమిస్తుంది. అంతేకాకుండా.. మన నడవడిక.. వ్యవహారశైలితోనే వైరస్‌ మనకు చుట్టుకుని, మన నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. అజాగ్రత్తను వీడి అప్రమత్తంగా ఉంటేనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలం. బాధ్యతగల పౌరులుగా..పరులహితం కోరే మనుషులుగా మనం జాగ్రత్త వహిద్దాం. కరోనా మహమ్మారిని తరిమికొడదాం.

ఇలా చేయండి.. 

  • తలుపులు చేతితో నెట్టకుండా భుజాన్ని వినియోగించండి. ప్రతి ఒక్కరూ టచ్‌ చేయడం వల్ల వైరస్‌ ఉండొచ్చు. తలుపు గొళ్లెం కూడా చేతితో తాకకుండా ఇతర మార్గాలను వెతకండి. ప్రధానంగా ఎక్కువ మంది ప్రాంతాల్లో మాత్రమే. 
  • మెట్లు ఎక్కేటప్పుడు పక్కనుంచే ఐరన్‌రాడ్‌ను పట్టుకోకుండా నడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మంది వాటిని తాకి ఉండొచ్చు. 
  • బ్యాంకులు, ఇతర సంస్థలకు వెళ్లినప్పుడు సోషల్‌డిస్టెన్స్‌ పాటించి, ఇతరులకు దూరంగానే నిలబడండి. 
  • తరచూ మాస్క్‌లను తీయొద్దు. చేతితో చాలా సార్లు తాకడం ద్వారా మాస్కుల ప్రయోజనం నెరవేరదు. 
  • లిఫ్టులు ఎక్కేటప్పుడు బటన్లను చేతి వేళ్లతో తాకొద్దు. మోచేతిని ఉపయోగించండి. కొన్ని అపార్టుమెంట్లలో టూత్‌ పిక్‌లను వాడుతున్నారు. ఒక్కసారి బటన్‌ నొక్కి వెంటనే టూత్‌పిక్‌ను డస్ట్‌బిన్‌లో పడేయాలి. 
  • లిఫ్టులోనూ అందరూ ఒకే వైపు మళ్లకుండా వేర్వేరు దిక్కుల్లో నిలబడడం శ్రేయస్కరం. 
  • ఎస్కలేటర్లు ఎక్కినప్పుడు, దిగేటప్పుడు కూడా పక్కనుండే సపోర్టును తాకొద్దు. 
  • భోజనం చేసేటప్పుడు కూడా ఒకే ప్లేట్లో పదార్ధాలను పెట్టుకొని షేర్‌ చేసుకోవద్దు. ప్రతి ప్లేట్‌లో కావాల్సిన అన్ని ఐటెమ్స్‌ను ముందే వడ్డించుకోవడం మంచిది. 


logo