శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 22, 2020 , 00:17:19

దొంగ వాహనాలపై ‘సీసీ’ నిఘా!

దొంగ వాహనాలపై ‘సీసీ’ నిఘా!

  • రాకపోకలు సాగించే వాహనాల లెక్కింపు
  • సిటీ ట్రాఫిక్‌లో అత్యాధునిక టెక్నాలజీ 
  • ఐటీఎంఎస్‌తో పటిష్ట నిఘా...
  • బండి చోరీ అయితే ఫిర్యాదు చేయండి : పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చోరీకి గురైన ఓ ఆటో.. నగరంలో తిరుగుతున్నది.. అయితే కొన్ని రోజుల క్రితం బషీర్‌బాగ్‌  చౌరస్తా నుంచి వెళ్తూ ఏఎన్‌పీఆర్‌ కెమెరాకు చిక్కింది.. వెంటనే కమాండ్‌ కంట్రోల్‌కు ఈ సమాచారం రావడంతో.. అక్కడున్న సిబ్బంది.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను అలర్ట్‌ చేయడంతో ఆ ఆటోను పట్టుకున్నారు.. ట్రాఫిక్‌ పోలీసులు ఆ ఆటోను నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.. నారాయణగూడ పోలీసులు ఆటో ఎక్కడ దొంగిలించారనే విషయాన్ని ఆరా తీయగా.. బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు.. ఇదంతా ఐదు నిమిషాల వ్యవధిలోనే జరిగింది.. ఇలా.. మూడు నెలల వ్యవధిలో చోరీకి గురైన పలు వాహనాల ఆచూకీని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు..

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం నగరంలో ఐటీఎంఎస్‌(ఇంటిగ్రేటెడ్‌/ఇంటెలిజెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) సిస్టమ్‌ను అమలు చేస్తున్నది. టాఫిక్‌ వ్యవస్థకు అత్యాధునిక టెక్నాలజీతో వాహనాల రాకపోకలు, వాహనాల నంబర్‌ ప్లేట్ల గుర్తింపు, సిగ్నల్‌ వ్యవస్థ,  అనుమానిత వాహనాల ట్రాకింగ్‌, టాప్‌ వాయిలెటర్స్‌ గుర్తింపు ఇలా... అంతా నిఘా కెమెరాలు గుర్తిస్తున్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించిన కెమెరాలను నగరంలో పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జనవరి 31 నాటికి 64 లక్షల వాహనాలున్నట్లు ఆర్టీఏ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రతి రోజు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 లక్షల వరకు వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. ఇందులో ప్రతి వాహనాన్ని గుర్తించే వ్యవస్థను ట్రాఫిక్‌ పోలీసులు ఐటీఎంఎస్‌ ద్వారా 200 కూడళ్లలో ఏర్పాటు చేశారు. అందులో 80 సీసీ(ఐటీసీసీ), 122(ఎన్‌పీఆర్‌), 50(ఎవిడెన్స్‌), 60 పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్స్‌, 62 వేరియబుల్‌ డిజిటల్‌ బోర్డులు ఉన్నాయి. ఆయా చౌరస్తాల్లో ట్రాఫిక్‌, స్థానిక పరిస్థితులను బట్టి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వర కు ఇందులో 40 శాతం కెమెరాలు పని మొదలు పెట్టా యి. మిగతా వాటికి ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ పూర్తయితే అవి కూడా పనులను ప్రారంభిస్తాయి. ఇందిరాపార్కు, జూబ్లీహిల్స్‌, ఎంజేమార్కెట్‌, అంబర్‌పేట్‌ రోడ్డు నం.6, రవీంద్రభారతి, బషీర్‌బాగ్‌, కర్బాల మైదానం, ప్యాట్నీ క్రాస్‌రోడ్స్‌ ఇలా పలు కూడళ్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

ఐటీసీసీ ...

  • ఐటీసీసీ(ఆటోమెటిక్‌ ట్రాఫిక్‌ కౌంటర్‌ కమ్‌ క్లాసిఫికేషన్‌) 

వ్యవస్థతో ఒక చౌరస్తా నుంచి ఎన్ని వాహనాలు వెళ్తున్నా యి.. అవి ఏ వాహనాలు అనేది ఆటోమెటిక్‌గా రికార్డు అ వుతుంది. ఒక సిగ్నల్‌ నుంచి మరో సిగ్నల్‌ వరకు వెళ్లే వా హనాలు పెరిగాయా? తగ్గాయా? తగ్గితే ఏ జెంక్షన్‌ వైపు వెళ్లాయి? పెరిగే ఏ జంక్షన్‌ వైపు నుంచి వచ్చాయి? అనే విషయాలను ప్రతి క్షణం లెక్కిస్తుంది. ఐటీసీసీ నుంచి వ చ్చే వాహనాల లెక్కలను బట్టి ట్రాఫిక్‌ జంక్షన్‌ మేనేజ్‌మెం ట్‌ కొనసాగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న కెమెరాలతో ప్రతి రోజు 7 లక్షల వరకు వాహనాలను ఈ కెమెరాలు లెక్కిస్తున్నాయి.  

   ఏఎన్‌పీఆర్‌ ...

నగరంలో తిరిగే ప్రతి వాహనం నంబర్‌ను ఏఎన్‌పీఆర్‌ (ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌)వ్యవస్థ గుర్తిస్తుం ది. ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు, లారీ లు, ఇతర భారీ వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సర్వర్లలో ఈ డేటాను స్టోర్‌ చేస్తుంది. ఒక నేరం చేసి నేరస్తులు వాహనంపై బయ లు దేరారంటే.. ఆ వాహనం నంబర్‌, ఆ వాహనం కలర్‌ ను ఈ వ్యవస్థతో క్షణాల్లో గుర్తించవచ్చు.  ఆ వాహన నంబర్‌తో నగరంలో ఏఏ సిగ్నల్స్‌ దాటి ఈ వాహనం వెళ్లింది అని తెలుసుకొని, పోలీసులను అప్రమత్తం చేస్తా రు. ఇలా ప్రస్తుతం దొంగతనాలకు గురైన వాహనాలను ఈ వ్యవస్థ ద్వారా గుర్తించి పట్టుకుంటున్నారు.

  కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ...

ఈ వ్యవస్థలో ఏర్పాటు చేసే కెమెరాలు కమిషనరేట్‌ కార్యాలయలో ఉండే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం అయి ఉంటాయి. ప్రతి విషయం ఇక్కడుండే సర్వర్లలో నిక్షిప్తమయి ఉంటుంది. ఈ కెమెరాలు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకే కాకుండా శాంతి భద్రతలు, నేరాల నివారణకు ఉపయోగపడుతాయి. ఈ కెమెరాల నుంచి వచ్చే అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు కమాండ్‌ కంట్రోల్‌లోని సిబ్బం ది గమనిస్తూ అందుకు సంబంధించిన సమాచారం  క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులకు చేరవేస్తాయి.  

 వాహనం పోయిందా.. ఫిర్యాదు చేయండి

సాంకేతికతను ఉపయోగించుకుంటూ నగర పోలీసులు నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడక్కడ.. అప్పుడప్పుడు జరుగుతున్న దొంగతనాల కేసులను సీసీ కెమెరాల సహకారంతో ఛేదిస్తున్నారు. అయితే బైక్‌ దొంగతనాలు జరిగితే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దొంగతనానికి గురైన వాహనం నంబర్‌ రికార్డులోకి వెళ్తుంది. దీంతో ట్రాఫిక్‌ విభాగంలోని ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు దొంగ వాహనాలపై నిఘాను కొనసాగిస్తుంటాయి. ఆ వాహనాలు నగరంలో ఆయా కూడళ్ల నుంచి వెళ్లాయంటే ఆ వాహనాన్ని గుర్తించి కెమెరాలు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌కు చేరవేస్తాయి. నిమిషాల వ్యవధిలోనే వాహనం వెళ్తున్న రూట్‌లో ఉండే ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకునేందుకు అవకాశాలుంటాయి. 


logo