గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 22, 2020 , 00:14:44

ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకోవాలి

ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకోవాలి

  • కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు  
  • నాలుగు కమిటీలు వేసేందుకు బోర్డు ఆమోదం    
  • వేసవిలో నీటి సమస్యపై వాడివేడి చర్చ
  • జనతా కర్ఫ్యూను పాటిద్దామని పిలుపు 
  • ముగిసిన కంటోన్మెంట్‌ బోర్డు సమావేశం 

కంటోన్మెంట్‌, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌ కంటోన్మెం ట్‌ బోర్డులో ఆర్థిక, ఆరోగ్య, విద్య, సివిల్‌ ఏరియా కమిటీలను వేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో కం టోన్మెంట్‌ వాసులకు నామమాత్రపు ఫీజులకు డయాలసిస్‌ సేవలను అందించేందుకు బోర్డు ఆమోదం తెలియజేసింది. 1924 లో రూపొందించిన కంటోన్మెంట్‌ అకౌంట్స్‌ యాక్ట్‌ను సవరిస్తూ బోర్డు పాలకమండలి కీలకనిర్ణయం తీసుకుంది. ఈ యాక్‌తో అకౌంట్స్‌విభాగంలో సేవలు  సరళతరంకానున్నాయి. శనివా రం కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్‌ అబిజిత్‌చంద్ర అధ్యక్షతన డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ కార్యాలయంలో జరిగిన బోర్డు పాల కమండలి సమావేశంలో సీఈవో చంద్రశేఖర్‌, వైస్‌ప్రెసిడెంట్‌ జె.రామకృష్ణ, జాయింట్‌ సీఈవో విజయ్‌కుమార్‌, సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాదాకేశవరెడ్డి, అనితప్రభాకర్‌, నళినికిరణ్‌, కె.పాండుయాదవ్‌, ప్యారసాని భాగ్యశ్రీ, లోక్‌నాథం, నామినేటెడ్‌ సభ్యులు, బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను వైస్‌ప్రెసిడెంట్‌ రామకృష్ణ, సీఈవో ఎస్వీఆర్‌ చంద్రశేఖర్‌  వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు. 

ఇండ్లలో ఉండి..ఆన్‌లైన్‌ సేవలను వాడాలి..

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కంటోన్మెంట్‌వాసులు ఇండ్లలోనే ఉండి, అన్‌లైన్‌ సేవలను వినియోగించుకోవాలని బోర్డు యంత్రాంగం పేర్కొంది. ఆస్తిపన్నులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని కోరింది. ట్రేడ్‌ లైసెన్స్‌లు, అసెస్‌మెంట్‌చార్జీలు, మ్యూటెషన్‌ అన్ని రకాల బిల్లులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సూచించారు. 24 గంటలపాటు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులో ఉంటాయని, కరోనా వైరస్‌ వల్ల బోర్డు కార్యాలయానికి పౌరులు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రజలు ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకుంటున్నారని సీఈవో చంద్రశేఖర్‌ వెల్లడించారు.

కీలక కమిటీల ఆమోదం..

బోర్డు పాలనలో కీలక భూమిక పోశించనున్న ఆర్థిక, ఆరోగ్య, విద్య, సివిల్‌ ఏరియా కమిటీలను వేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. కమిటీల విషయంలో తీసుకున్న  బోర్డు నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు నివేదించనుంది. కేంద్రం నుంచి ఆమోదం రాగానే పైన పేర్కొన్న కమిటీలను వేయనుంది. కాగా ఆర్థిక, సివిల్‌ ఏరియా కమిటీలకు చైర్మన్‌గా బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించగా, ఆరోగ్య, విద్య కమిటీలకు ఏడుగురు బోర్డు సభ్యుల్లోంచి ఇద్దరిని చార్మన్లకు ఎన్నుకోనున్నారు. ఈ కమిటీల్లో చైర్మన్‌పాటు మెంబర్‌ సెక్రటరీగా సీఈవో, సభ్యులుగా ముగ్గురు ఎన్నికకాబడిన సభ్యుడు, మరో ముగ్గురు నామినేటేడ్‌ సభ్యులు మెంబర్లుగా ఉంటారు.

నామమాత్రపు చార్జీలతో డయాలసిస్‌ సేవలు..

భగవాన్‌ మహావీర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బలంరాయిలోని డిస్పెన్సరీ ప్రాంగణంలో కంటోన్మెంట్‌వాసులకు నామామాత్రపు ఫీజులతో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ట్రస్ట్‌ డిస్పెన్సరీ ప్రాంగణంలో సొంత ఖర్చులతో డయాలసిస్‌ కేంద్రాన్ని నిర్మించుకోని, రూ.200లకే డయాలసిస్‌తోపాటు పరీక్షలను అందించనుంది. అయితే ట్రస్ట్‌ నిర్మించిన భవనాన్ని కంటోన్మెంట్‌ బోర్డు కు  అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. అ గ్రిమెంట్‌లో డ యాలసిస్‌ సేవ లు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తారు.

కరోనా కట్టడికి చర్యలు..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని బోర్డులో చర్చించారు. కరోనాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సర్కారు  కరోనా వైరస్‌ కోసం కేటాయించిన నిధుల నుంచి కంటోన్మెంట్‌ బోర్డుకు కొంతమొత్తం ఇవ్వాలని, సామగ్రి సహకారాన్ని అందజేయాలని త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలువాలని నిర్ణయం తీసుకున్నా రు. అదేవిధంగా పారిశుధ్య నిర్వహణ పనులను విస్తృతంగా చేపట్టాలని హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిసరాల పరిశుభత్రతోపాటు స్వీయ శుభ్రతను పాటించాలని, ప్రజలను ఎప్పటికప్పుడు జాగృత పర్చాలని నిర్ణయం తీసుకుంది. 

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా.. 

వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పలువురు సభ్యు లు సమస్యను లేవనెత్తారు. దీనిపై స్పందించిన బ్రిగేడియర్‌ అబిజిత్‌ చంద్ర ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే మార్గాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని వాటర్‌ వర్క్‌ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. 3,5, 6 వార్డుల్లో నీటి సమస్య ఉందని స్థానిక బోర్డు సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి, భవనాల మరమ్మతులపనులతోపాటు నూతన భవనాల అనుమతులకు బోర్డు ఆమోదం తెలియజేసింది. 

జనతా కర్ఫ్యూను పాటిద్దాం..

భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివా రం జనతాకర్ఫ్యూను పాటించాలని బోర్డు వైస్‌ప్రెసిడెంట్‌ రామకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ను మందులేదని, వైరస్‌ భారీనపడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇండ్ల  నుంచి బయటకు రావద్దన్నారు. వదంతులు, చెప్పుడు మాటలు నమ్మొద్దని కోరా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ఇచ్చే మార్గదర్శకాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాండుయాదవ్‌, లోక్‌నాథం, నళినికిరణ్‌, మాజీ సభ్యుడు వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>