హైదరాబాద్ : ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ కొనియాడారు. పీఆర్సీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ఉద్యోగులంతా మరింత ఉత్సాహంతో బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకుంటారని పేర్కొన్నారు.