సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 03:52:41

దేవాలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు

దేవాలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు

  • అర్చనలు, అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలు నిలిపివేత
  • ఏకాంతంగా పూజలు కొనసాగుతాయి..
  • ఉగాది, శ్రీరామనవమి పండుగ రోజున బంద్‌

బేగంపేట: కరోనా ప్రభావంతో ప్రతిష్ఠాత్మక సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయాన్ని మూసివేశారు. కేవలం అమ్మవారికి  ఏకాంత పూజలు మాత్రమే కొనసాగనున్నాయి. భక్తులను ఆలయంలోకి  అనమతిం చడం లేదు.  దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు దేవాలయం ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఆర్జిత సేవలు, వాహన  తదితర పూజలను  నిలిపివేస్తున్నట్టు వివరించారు.  దేవాదాయశాఖ కమిష నర్‌ తదుపరి ఉత్తర్వులు  వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. 

ఎల్లమ్మ, కనకదుర్గమ్మ ఆలయాలు...

అమీర్‌పేట్‌(నమస్తే తెలంగాణ): అమీర్‌పేట్‌లోని శ్రీ కనక దుర్గమ్మ దేవా ల యంతో పాటు బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానాలలోకి భక్తు లకు ప్రవేశాలను నిలిపివేస్తూ తాజాగా శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అమీర్‌పేట్‌ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మ వార్ల కు జరుగు నిత్య కైంకర్యాలు భక్తులు లేకుండానే అర్చకులు నిర్వహిస్తారు. అర్చనలు, అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో ఆకుల నరేందర్‌, ఛైర్మన్‌ కె.మల్లికార్జునప్పలు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి పండుగ రోజున కూడా భక్తులకు ఆలయంలోకి అను మతించేది లేదన్నారు.  బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఉదయం జరిగే అభిషేకాలు, అర్చనలు, కైంకర్యాలు ఇతరత్రా విశేష పూజలన్నీ ఆలయ అర్చకులే నిర్వహిస్తారని ఆలయ ఈవో ఎం.వి.శర్మ తెలిపారు. 

 ఆంజనేయ స్వామి, లక్ష్మీ గణపతి దేవాలయాలు...

చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని వివేక్‌నగర్‌  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి 31వ తేదీ వరకు  భక్తులు  ఎవ్వరు రావద్దని ఈవో దేవనాథం విజ్ఞప్తి చేశారు. కానీ యథావిధిగా స్వామి వారికి నిత్య పూజలు కొనసాగుతాయని ఆయన వివరించారు. అదే విధంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కూడా భక్తులకు దర్శనం   ఉండదని దేవాలయం ఈఓ దీప్తి తెలిపారు. ఉగాది పర్వదినము రోజు కూడా అర్చకులు ఏకాంతంగా  స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు కూడా భక్తులు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశా రు. నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవా లయంలో అన్ని ఆర్జిత సేవలు నిలిపివేసినట్టు ఈఓ సురేందర్‌ తెలిపారు. స్వామి వారికి నిత్య పూజలు కొనసాగుతాయని తెలిపారు. 

 శ్రీవేంకటేశ్వరస్వామి, సుచిత్ర శివాలయం...

పేట్‌బషీరాబాద్‌: కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ జీడిమెట్ల డివిజన్‌ పరిధి గోదావరి హోమ్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసి వేశారు.  సుచిత్రలోని శివాలయంలోనూ సేవలను నిలిపివేశారు.  మాస కల్యాణం, శనివారం దర్శనం, అన్నప్రసాద వితరణలు ఉండవని ఆలయ కమిటీ పేర్కొంది.  


logo