బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 03:42:17

పార్సిళ్లన్నీ..సెక్యూరిటీ వద్దే

పార్సిళ్లన్నీ..సెక్యూరిటీ వద్దే

  • గౌతమీ ఎన్‌క్లేవ్‌..శ్రీరామ్‌నగర్‌ కాలనీల్లో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు
  • మహేశ్‌గౌడ్‌  కొండాపూర్‌

స్వీయ ఆరోగ్య సంరక్షణ చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్‌ 19తో యుద్ధం చేయవచ్చని కొండాపూర్‌లోని గౌతమీ ఎన్‌క్లేవ్‌ కమ్యూనిటీ, శ్రీరామ్‌నగర్‌ బీ బ్లాక్‌ కాలనీల సంక్షేమ సంఘాలు నిరూపిస్తున్నాయి. ఈ దిశగా తమ అపార్టుమెంట్ల వద్ద ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నాయి. కాలనీల్లోని పార్కులతోపాటు ఇతర పబ్లిక్‌ ప్రదేశాలను పూర్తిగా మూసివేశారు. వ్యాధి ప్రబలకుండా మాస్కులను పంపిణీ చేస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కాలనీ అంతటా రసాయనలను పిచికారి చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలోకి డెలివరీ ఇచ్చేందుకు వచ్చే వ్యక్తులను నేరుగా కలువకుండా సెక్యూరిటీ దగ్గరే పార్సిళ్లు ఇచ్చి వెళ్లేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంట్లోకి వచ్చే వ్యక్తులు, పని మనుషులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. 

ముందస్తు అవగాహన కల్పిస్తున్నాం

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి స్తున్న కరోనా వైరస్‌పై కాలనీ వాసులలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. వైరస్‌ను దరిచేరనీయకుండా జాగ్రత్తలు చెప్పి ధైర్యాన్ని నింపుతున్నాం. ఇప్పటికే అసోసియేషన్‌ సభ్యుల సహకారంతో..  కాలనీలో పూర్తిగా స్వచ్ఛతను పాటించేలా, ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లను వినియోగించేలా చూస్తున్నాం. 

-జనార్దన్‌రెడ్డి, గౌతమీ ఎన్‌క్లేవ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


logo
>>>>>>