శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 20, 2020 , 03:14:15

ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌... మాస్క్‌లతో పది పరీక్షలకు అనుమతి

ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌... మాస్క్‌లతో పది పరీక్షలకు అనుమతి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎస్సెస్సీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా నేపథ్యం లో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్‌లు ధరించి విద్యార్థులు ప్రవేశించేందుకు అనుమతించారు. అంతే కాకుండా.. పరీక్షా కేంద్రాల్లో చేతులు కడుక్కోవడానికి వీలుగా శానిటైజర్‌, సబ్బులు అందుబాటులో ఉంచగా, విద్యార్థులు సైతం సొం తంగా నీళ్లబాటిల్‌, చేతిరుమాలు, శానిటైజర్లు వెంట తెచ్చుకునేందుకు అనుమతించారు. ఇక దగ్గు, జలుబు ఉన్న వారి కోసం ప్రతీ కేంద్రంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటుచేశారు. తొలిరోజు మొత్తం 71, 219 మందికి గాను 70,497 మంది హాజరుకాగా, 722 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 362 పరీక్షాకేంద్రాలకు గాను 109 పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు డీఈవో వెంకటనర్సమ్మ తెలిపారు.

పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ముందస్తుగా రావడం, ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయి తే ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లుగా అనుమతించారు. విద్యార్థులను ఆపితే గుమిగూడే అవకాశముండటంతో ముం దుగా వచ్చిన వారందరిని పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. కొన్ని సెంటర్లలో విద్యార్థులను క్యూలైన్లలో నిలబెట్టి శానిటైజేషన్‌ చేసిన తర్వాతే హాల్లోకి పంపించడం కనిపించింది.

క్షుణ్ణంగా తనిఖీలు.. 

పరీక్షకు వచ్చిన విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించారు. హాల్‌ టికెట్లు, సెల్‌ఫోన్‌లు, ఇతర కాగితాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నా రు. పరిమితమైన వస్తువులను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు. పెన్నులు, పెన్సిల్స్‌ కోసం కొంత మంది చిన్న చిన్న బ్యాగులను తీసుకురావడంతో ఇన్విజిలెటర్లు వాటిని అనుమతించలేదు. దీంతో వాటిని బయటే వదిలేశారు.

రంగారెడ్డి జిల్లాలో 208 కేంద్రాలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 47,181 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,078 మంది హాజరయ్యారు. తెలుగు పరీక్ష-1కు 103 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని జిల్లా విద్యాధికారి  విజయలక్ష్మి చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు  మాస్క్‌లు అందజేసింది. సిట్టింగ్‌ స్కాడ్‌, ‘సీ’సెంటర్‌లో కస్టోడియన్లు 12, జిల్లా స్థాయి అబ్జర్వర్‌, డీఈవో,  ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ మొత్తం 67 పరీక్ష కేంద్రాలను సందర్శించారు. 

135 మంది విద్యార్థులు డుమ్మా

మేడ్చల్‌ కలెక్టరేట్‌:  మేడ్చల్‌ జిల్లాలో  పది పరీ క్షలు ప్రశాంతంగా జరిగాయి.  జిల్లాలో 191 సెం టర్లలో  43702 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయాల్సి ఉం డగా 43567 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యా రు. 135 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.  పరీక్ష కేంద్రాలలో ఫ్లయింగ్‌ స్కాడ్‌ తనిఖీ చేయగా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని  జిల్లా విద్యా ధికారి విజయ కుమారి తెలిపారు.


logo