సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 18, 2020 , 03:17:17

మందుబాబులూ... మీ కార్డులు జాగ్రత్త

మందుబాబులూ...  మీ కార్డులు జాగ్రత్త

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చదివింది 10వ తరగతి ... బతకడానికి నగరానికి వచ్చి బార్లు, పబ్‌లలో పనిచేశాడు.. ఇక్కడే మందుబాబులను టార్గెట్‌ చేసుకుని.. కార్డుల క్లోనింగ్‌తో డబ్బులు కొట్టేయాలనుకున్నాడు... ఇందుకు ఇద్దరిని కలుపుకుని ..బిల్లులు చెల్లించేక్రమంలో కార్డుల డేటా తీసుకుని.. మొత్తం 150 మంది కార్డులను క్లోనింగ్‌ చేసి.. రూ.30 లక్షలను కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఒడిశాకు చెందిన ముగ్గురు సభ్యు ల ముఠాను పట్టుకున్నారు. 

 మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరాలు వెల్లడించారు.  గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్‌.. తమ ఖాతాదారుడి ఏటీఎం కార్డులోనుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.76వేలు డ్రా చేశారని పోలీసులకు  ఫిర్యాదు చేశా డు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. నిందితులు ఒడిశా గంజామ్‌ జిల్లా గోలాంతర గ్రామానికి చెందిన ప్రఫు ల్‌ కుమార్‌ నాయక్‌, హేమంత్‌కుమార్‌ నాయక్‌, సుజిత్‌కుమార్‌ నాయక్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరి మోసాలు వెలుగులోకి వచ్చా యి. నిందితుల నుంచి రూ.10.10లక్షల నగదు, స్కిమ్మర్‌, క్లోనింగ్‌ మెషిన్‌, ల్యాప్‌టాప్‌, క్లోనింగ్‌ కార్డులు 44, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మోసం ఇలా....

ప్రధాన నిందితుడు ప్రఫుల్‌ కుమార్‌ నాయక్‌  పదవ తరగతి వరకు చదువుకున్నాడు. 2017లో హైదరాబాద్‌ వలస వచ్చి పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెటంట్లలో వెయిటర్‌గా పని చేశాడు. ఆ సమయంలో కార్డు స్కిమ్మింగ్‌ గురించి నేర్చుకున్నాడు. ఆన్‌లైన్‌లో స్కిమ్మర్‌ను కొనుగోలు చేసి.. రాత్రి సమయాల్లో మందుబాబులను టార్గె ట్‌ చేసుకుని.. వారు బిల్లు చెల్లించేందుకు ఇచ్చే క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డులను మొదట తన స్కిమ్మర్‌లో ైస్వెప్‌ చేసుకుని.. ఆ తర్వాత పీఓఎస్‌ మెషిన్‌లో ైస్వెప్‌ చేసేవాడు. ఆ తర్వాత కొన్ని మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డులను కొనుగోలు చేసి.. స్కిమ్మర్‌లో స్టోర్‌ చేసుకున్న క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటాను డౌన్‌లోడ్‌  చేసుకునేవా డు. ఆ తర్వాత వాటి ద్వారా ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఇలా..150 బ్యాంకు ఖాతాదారులను బో ల్తా కొట్టించి.. ముఠా సభ్యులతో కలిసి దోచుకున్నాడని తేలింది.  

ఈ మోసం గురించి.. తన గ్రామానికి చెందిన హేమంత్‌ కుమార్‌ నాయక్‌కు చెప్పి.. తన టీంలో చేర్చుకున్నాడు.  అతనికి స్కిమ్మర్‌ ఇచ్చి.. బార్‌లు, రెస్టారెంట్‌లలో కార్డులను ైస్వెప్‌ చేయాలని సూచించాడు. అలా.. హేమంత్‌ కుమార్‌ 10 రోజులకు ఒక్కసారి బార్లలో పనిచేసి కార్డు ల  సమాచారాన్ని సేకరించి..  ప్రపుల్‌ కుమార్‌ నాయక్‌కు ఇవ్వగా.. అతను క్లోనింగ్‌ కార్డును రూపొందిస్తాడు. ఆ కార్డులతో ఏటీఎంలలో డబ్బులు విత్‌ డ్రా చేయడా నికి.. తన గ్రామానికి చెందిన సుజిత్‌ కుమార్‌ నాయక్‌ను కలుపుకున్నారు. ఇలా.. ముగ్గురు కలిసి హైదరాబాద్‌లోనే స్కిమ్మర్‌ ద్వారా కార్డులను క్లోనింగ్‌ చేసి.. వాటి ద్వారా నగరంలోనే నగదును దోచేశారు.

తెల్లవారు జామునే విత్‌ డ్రా....

ఈ ముఠా నాయకుడు ప్రపుల్‌ కుమార్‌ నాయక్‌ ఆదేశాల మేరకు సుజిత్‌కుమార్‌ నాయక్‌.. క్లోనింగ్‌ కార్డుల తో కేవలం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యనే డ్రా చేసేవాడు.  ఈ సమయంలో ఏటీఎంలలో ఇతర ఖాతాదారుల లావాదేవీలు ఎక్కువ ఉండవని .. అంతేకాకుం డా సీసీ కెమెరాల్లో కూడా దృశ్యాలు సరిగ్గా రావని వారి నమ్మకమని విచారణలో తెలిసింది.  ఈ ముఠాను పట్టుకున్న ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ బృందాన్ని డీసీపీ అభినందించారు.


logo