ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 17, 2020 , 02:52:36

ఆటాడుకుందాం రా..!!

ఆటాడుకుందాం రా..!!
  • గ్రామాలకు వెళ్లేందుకు నగరవాసుల ఆసక్తి
  • పార్కుల మూతతో ఇంటి వద్దే పిల్లల ఆటలు
  • సందడిగా మారుతున్న వీధులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్కులు, సినిమాహాళ్లను కూడా మూసివేశారు. దీంతో నగరవీధులన్నీ బోసిపోయాయి. దీంతో ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటి వద్దే పిల్లలు ఆటల్లో మునిగిపోయారు. కొంతమంది క్రికెట్‌, మరికొంతమంది సెల్‌ఫోన్లు లేదా టీవీలకు అతుక్కుపోయారు. దీంతో వీధులన్నీ పిల్లలతో సందడిగా మారాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారి పిల్లలను ఊళ్లకు పంపిం చాలని, అక్కడ వాతావరణం బాగుంటుందని చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఊళ్లకు పంపించారు. నగరవాసుల్లో కరోనా భయం కనిపిస్తున్న దాఖలాలు లేకపోయినా ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో యువత దూరప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కుటుంబాలు పల్లెల్లో ఉన్న అమ్మమ్మ, నానమ్మ తాతయ్యల వద్దకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. 


హైదరాబాద్‌లోనే చికిత్స.. అదే భయం

కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ధైర్యంగా అనిపిస్తున్నప్పటికీ రిస్క్‌ తీసుకోవ డం మంచిది కాదు. రాష్ట్రం లో కరోనా కేసు ఎక్కడ నమోదైనా హైదరాబాద్‌లోనే చికి త్స. ఇక్కడి గాలికి మనం కొద్దిరోజులు దూరం వెళ్లడం మంచిది. ముఖ్యంగా మా పిల్లలను వారి నాయినమ్మ ఇంటికి పంపించాం. ఎలాగూ సెలవులు రావడం కూడా వారికి కలిసొచ్చింది. 

-ఆర్‌. పల్లవి, ఉప్పల్‌


పల్లె వాతావరణం బాగుంటుంది

 పల్లె వాతావరణం పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుం ది. అక్కడ స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుంది. నగరంలో ఇప్పటికే కరోనా  భయంతో ప్రభుత్వం పాఠశాలలకు, సెలవులను ప్రకటించింది. అందుకే మా పిల్లలను నానమ్మ, తాతయ్య వద్దకు పంపించాం. పల్లెల్లో వాతావరణం చాలా బాగుంటుంది. 

 - కసిరెడ్డి నరేందర్‌రెడ్డి, రెజిమెంటల్‌బజార్‌                                                


పల్లెల్లోనే ఆరోగ్యం 

ఆర్థికంగా ఎంత బాగున్నా.. ఆరోగ్యం బాగాలేకుంటే జీవి తం వృథా. మంచి గాలి, పరిశుభ్రమైన వాతావరణం, రసాయనాలు లేని కూరగాయలు పల్లెటూర్లో ఉంటా యి. కరోనా కట్టడి చేసే వర కు పల్లెటూర్లోనే ఉండాలని అనుకుంటున్నాం. అం దుకే ఆసిఫాబాద్‌కు టికెట్లు బుక్‌ చేసుకున్నాం. పిల్లలతోపాటు మేము వెళ్తాం. 

- సంగీత, ఈస్ట్‌ మారేడుపల్లి


పిల్లలను ఊరికి పంపిస్తున్నా...

కరోనా నిర్మూలనకు ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయినా సిటీ వాతా వరణానికి పల్లె వాతావర ణానికి చాలా తేడా ఉం టుంది. కరోనా ప్రభావం తో ప్రభుత్వం  పాఠశాలల కు సెలువు ప్రకటించింది. దీంతో  మా పిల్లలను రేపు మా అమ్మ వాళ్ల ఇంటికి పంపిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో కొన్ని రోజులపాటు ఉంటే పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. 

- పెంటా స్వప్న, వాల్మీకినగర్‌


logo