బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 17, 2020 , 02:44:07

‘స్వచ్ఛ’ విల్లా ‘హరిత’ కళ

‘స్వచ్ఛ’ విల్లా ‘హరిత’ కళ

బండ్లగూడ:  తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్‌ ఎరువును తయారు చేసి.. మొక్కలకు ఎరువుగా వాడుతూ  ఆదర్శంగా నిలుస్తున్నారు.  నగర శివారు బండ్లగూడ జాగీర్‌ నగర పాలక సంస్థ పరిధి, బండ్లగూడలోని ప్రెస్టీజ్‌ రాయల్‌ ఉడ్స్‌ విల్లా వాసులు అత్యాధునిక యంత్రం ద్వారా తడి చెత్త నుంచి కంపోస్ట్‌ తయారు చేస్తున్నారు. విల్లాల్లోని పార్కులు,  మొక్కలకు వినియోగిస్తున్నారు. సమీపంలోని విల్లాలు, కాలనీ వారు ఇక్కడికి చేరుకుని కంపోస్ట్‌ తయారీ విధానం, కంపోస్ట్‌ తయారీకి వినియోగించే యంత్రం వివరాలను తెలుసుకుంటున్నారు. 


మొక్కలకు ఎరువుగా..

బండ్లగూడలో 28 ఎకరాల స్థలంలోని 153 విల్లాలు గల ప్రెస్టీజ్‌ రాయల్‌ ఉడ్స్‌ విల్లాలో కొంత కాలంగా తడి చెత్త ద్వారా కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు.  విల్లాలో చెత్త కోసం ఓ గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. తడి చెత్తను ఓడబ్ల్యూసీ 60 ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ (కంపోస్ట్‌ యంత్రం)లో వేయడంతో కొంత నీటి శాతం తగ్గిన చెత్త బయటకు వస్తుంది. దీన్ని ప్లాస్టిక్‌ ట్రేలలో నిల్వ ఉంచి బొట్లుబొట్లుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తారు. పదిహేను రోజుల తర్వాత ఆ చెత్తను బయటకు తీసి ఎండలో ఆరబెడితే కంపోస్ట్‌ తయారవుతుంది. దీన్ని విల్లాలోని పార్క్‌, మొక్కలకు వేస్తున్నారు. దీంతో పార్క్‌లో పచ్చిక బయళ్లు కనువిందు చేస్తున్నాయి. ఈ విల్లాల నుంచి సేకరించిన చెత్త ద్వారా ప్రతి రోజూ 25 కిలోల నుంచి 40 కిలోల తడి చెత్తను యంత్రంలో వేసి 18 నుంచి 20 కిలోల కంపోస్ట్‌ ఎరువును ఉత్పత్తి చేస్తున్నట్లు మేనేజర్‌ కిశోర్‌ తెలిపారు. 


logo