గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 17, 2020 , 02:40:36

‘కరోనా’ను వదలని సైబర్‌..!

‘కరోనా’ను వదలని సైబర్‌..!
  • విమానా టిక్కెట్స్‌ రద్దు చేసుకునేవారే టార్గెట్‌..
  • కాల్‌సెంటర్‌ నంబర్‌ కోసం గూగుల్‌ సెర్చ్‌..
  • సైబర్‌ చీటర్ల చేతికి బాధితులు
  • లింక్‌ క్లిక్‌తో ఖాతాలు ఖాళీ...
  • సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదులు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌ చీటర్ల నేరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి.. ప్రస్తుతం కరోనా వైరస్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుం టున్నారు. కరోనా భయంతో విమాన టిక్కెట్లను రద్దుచేసుకునేవారిని టార్గెట్‌ చేసి దోచుకుంటున్నారు. కరానోతో ముందుజాగ్రత్త చర్య గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.. ఇందు లో భాగంగా చాలా మంది  తమ ప్రయాణాలను వాయి దా వేసుకుంటున్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు... ఇక్కడి నుంచి వివిధ ప్రదేశాలకు వెళ్లేవారు అడ్వాన్స్‌గా బుక్‌చేసుకు న్న విమానా టిక్కెట్లను రద్దుకు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా విమానయాన సంస్థలకు సంబంధించిన కాల్‌సెంటర్‌ ఫోన్‌ నంబర్‌ కోసం కొందరు గూగుల్‌పై ఆధారపడుతున్నారు. ఇదే వారి కొంపముంచుతుంది.. విమాన సంస్థ పేరుతో నకిలీ ఫోన్‌ నంబర్లను గూగుల్‌లో ఫీడ్‌ చేసి సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.  అడ్వాన్స్‌ బుకింగ్‌లో టిక్కెట్‌ను  రూ. 1500 నుంచి రూ. 5వేలకు వివిధ ప్రధాన నగరాలకు బుక్‌ చేసుకున్నవాళ్లు.. సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఈ కేసులు క్రమంగా హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాకు పెరుగుతున్నాయి. సోమవారం ఇలాంటి ఫిర్యాదులు రెండు సీసీఎస్‌ సైబర్‌ ఠాణాలో నమోదయ్యాయి.  

n బంజారాహిల్స్‌కు చెందిన భాను బెంగుళూరు వెళ్లేందుకు అడ్వాన్స్‌గా బుక్‌ చేసిన విమాన టిక్కెట్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయాలనుకున్నా డు. దీంతో ఇండిగో ఎయిర్‌ లైన్స్‌కు చెందిన కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌సెర్చ్‌ చేశాడు.  అందులోని ఒక నంబర్‌కు ఫోన్‌చేసి.. టిక్కెట్‌ను రద్దు చేస్తున్నా అని చెప్పాడు. వెంటనే తాము పంపించే లింక్‌ను క్లిక్‌ చేసి.. వివరాలు పొందుపరచండి.. ఆ వివరాలు పరిశీలించి మీ బ్యాంకు ఖాతాకు రద్దయిన డబ్బును జమ చేస్తామంటూ సైబర్‌నేరగాళ్లు నమ్మించారు. వెం టనే బాధితుడు ఆ లింక్‌ క్లిక్‌ చేసి అందులో బ్యాంకు ఖాతా వివరాలు పొం దుపరిచాడు. ఇంతలో వచ్చిన ఓటీపీని కూడా  బాధితుడు చెప్పడంతో  సైబర్‌నేరగాళ్లు మూడు దఫాలుగా లక్ష రూపాయలు బాధితుడి ఖాతాలో నుంచి సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

n నగరానికి చెందిన శ్రీధర్‌.. తన కొడుకుకు సంబంధించి కోయంబత్తూరుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేశాడు. అయితే దా న్ని రద్దు చేసుకోవడం కోసం గూగుల్‌సెర్చ్‌లో కస్టమర్‌కేర్‌ నంబర్‌ కోసం ప్రయత్నించగా..  8509364350 నంబర్‌ కన్పించింది.. వెంటనే దానికి ఫోన్‌ చేయగా.. ఎంగేజ్‌ వచ్చింది.. మరుక్షణంలోనే 8509369089 నుంచి శ్రీధర్‌కు ఫోన్‌ వచ్చింది. మేం ఎయిర్‌ ఇండియా కస్టమర్‌ కేర్‌ నుం చి మాట్లాడుతున్నామంటూ నమ్మించారు. అయితే మీరు టిక్కెట్టు ర ద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఫలాన నంబర్‌కు రూ. 25 గూగుల్‌ పేలో పంపించండంటూ సూచించారు. దాంతో అతను  ఆ నంబర్‌కు రూ. 25 పంపించాడు. ఆ తరువాత మీకు ఒక మెసేజ్‌ వస్తుంది.. దాన్ని మరో నంబర్‌కు పంపించండంటూ బాధితుడి గూగుల్‌పే ఖా తాను తమ అధీనంలోకి తీసుకొని, ఆ ఖాతాలోని రూ. 24 వేలను సైబర్‌నేరగాళ్లు కాజేశారు.


logo
>>>>>>