గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 16, 2020 , 02:59:59

గగనవీధిలో..అలా..

గగనవీధిలో..అలా..
  • ముగిసిన‘వింగ్స్‌ ఇండియా-2020’
  • చివరిరోజు ఆకట్టుకున్న విహంగ విన్యాసాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బేగంపేట ఎయిర్‌పోర్టులో నిర్వహిస్తున్న వింగ్స్‌ ఇండియా - 2020 ఎయిర్‌ షో ఆదివారం ముగిసింది. చివరి రోజు గగనతలంలో చేసిన విమానాల విన్యాసాలు సందర్శకులను రెప్పార్పకుండా చేశాయి. ఏవియేషన్‌ షో ప్రారంభమైనప్పటి నుంచి సారంగ్‌ టీం, మార్క్‌ జెఫ్రీ బృందాల మధ్యే దాదాపు పోటీ జరుగుతున్నట్టు కనిపించింది. సారంగ్‌ బృందం ఆధ్వర్యంలో నాలుగు హెలికాప్టర్ల షో ప్రధానంగా కొనసాగింది. చివరి రోజు హెలికాప్టర్లలో సాంకేతిక లోపం కారణంగా వారి ప్రదర్శన నిలిచిపోయింది. మరోవైపు మార్క్‌ జెఫ్రీ బృందం ఆధ్వర్యంలో ఎక్స్‌ట్రా - 300ఎస్‌, 300 ఎస్‌సీ, ఎక్స్‌ట్రా - 260లతో విహంగాల  ప్రదర్శన ఆకట్టుకున్నది. 


logo