ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 16, 2020 , 02:56:26

కరోనా ‘కట్టడి’..!

కరోనా ‘కట్టడి’..!

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు.. మరోవైపు ఒక్క సారిగా పెరిగిన ఎండలతో ఆదివారం నగరం బోసిపోయింది. వారాంతపు సెలవుల్లో రద్దీగా ఉండే సినిమాహాళ్లు, జూపార్క్‌, సంజీవయ్యపార్కు, ప్రియదర్శిని పార్కు, జలవిహార్‌, నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌తో పాటు ప్రధాన కూడళ్లు, రహదారులు వెలవెలబోయాయి. ఈత కొలనులు, జిమ్‌లకు తాళాలు వేశారు. కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు మూతపడ్డాయి. బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు తెరుచుకోలేదు. మ్యూజియాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు రద్దయ్యాయి. ప్రజలు మాస్కులు ధరించి రోడ్లపైకి వచ్చారు. కాగా నగరంలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత  34.4 డిగ్రీలు  నమోదైంది.


logo