గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 14, 2020 , 02:32:50

ఆకాశంలో.. అదరహో

ఆకాశంలో.. అదరహో

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత ప్రభుత్వం - పౌర విమానయాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో  బేగంపేట ఎయిర్‌పోర్టులో రెండో రోజు శుక్రవారం ‘వింగ్స్‌ ఇండియా - 2020’  ప్రదర్శన, వివిధ దేశాలకు చెందిన పైలెట్లు చేసిన ఎయిర్‌ షో వీక్షకులను ఆకట్టుకుంది. మరో రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు, ఎయిర్‌ షోలు, ఎయిర్‌ క్రాఫ్ట్‌లకు సంబంధించిన ప్రదర్శనలు జరగనున్నాయి. 


 అవగాహన కల్పించాలి..

వైమానికం, అంతరిక్షం గురించి మహిళలకు అవగాహన కల్పించాలి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో  విమానయాన అవగాహన, విద్యను ప్రోత్సహించాలి. ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఏరో క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఫ్లయింగ్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇతర రంగాలపై మేథస్సు గల సంస్థల సహకారంతో వైమానిక, అంతరిక్ష అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి.   

 - హరిప్రీత్‌ ఏ.దే సింగ్‌, ప్రెసిడెంట్‌, ఇండియన్‌ ఉమెన్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌ 


 37 పరిశోధన శాలలున్నాయి..

   సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో 37 పరిశోధనశాలలున్నాయి. వాటిలో ముఖ్యమైన వైమానిక పరిశోధనశాల బెంగళూరులో ఉంది. అదే, జాతీయ అంతరిక్ష పరిశోధనశాల. దేశంలో వైజ్ఞానిక పరిశోధనశాలలో ముఖ్యమైన సంస్థ సీఎస్‌ఐఆర్‌. కౌన్సిల్‌ సైంటిఫికల్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌. దీని ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే.. శాస్త్ర సాంకేతిక రంగంలో వివిధ శాస్ర్తాలలో.. ఫిజికల్‌ సైన్స్‌, కెమికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ సైన్స్‌ల్లో 37 పరిశోధనశాలలు ఉన్నాయి. ఇది శాస్త్ర సాంకేతిక రంగ విభాగం ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఆ 37 పరిశోధనశాలలో ముఖ్యమైనది జాతీయ వైమానిక పరిశోధనశాల. ఇది బెంగళూరులో కేంద్రీకృతమై ఉంది.  ఇలాంటి పరిశోధనల దిశగా యువత, ఆసక్తి గలవారు ముందుకు రావాలి. ఈ తరహా పరిశోధనలు మరిన్ని జరగాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. 

- కె.అనంత ప్రసాదచారి, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీ) 


logo
>>>>>>