బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 14, 2020 , 02:31:42

మహిళలు అన్నిరంగ్లాలో రాణిస్తున్నారు..

మహిళలు  అన్నిరంగ్లాలో  రాణిస్తున్నారు..

కొండాపూర్‌, మార్చి 13 : మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ‘రీసైలెన్స్‌' చిత్ర ప్రదర్శన ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథిగా విచ్చేశారు. గతంలో పెయింటింగ్‌ కేవలం పురుషులే వేసేవారని, కానీ నేడు భిన్నంగా మారిందన్నారు. మగవాళ్లతో సమానంగా మహిళలు పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, జర్నలిజం, ఐటీ రంగాల్లో దూసుకుపోతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గతంతో పోల్చితే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళల సంఖ్య పెరిగిందన్నారు. ఫొటో ప్రదర్శన ఈ నెల 27వ తేదీ వరకు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ కే.లక్ష్మి, చిత్రకారులు పాల్గొన్నారు. logo
>>>>>>