శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 10, 2020 , 02:49:31

విదేశాల నుంచి వచ్చే వారికి విధిగా పరీక్షలు..

విదేశాల నుంచి వచ్చే వారికి విధిగా పరీక్షలు..

శంషాబాద్‌, మారి 9 :  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని సోమవారం మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలించారు. వివిధ విభాగాలను పర్యావేక్షించారు. ధర్మల్‌ స్క్రీనింగ్‌లో రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రతినిత్యం విదేశాల నుంచి వచ్చే ప్రయాణిలకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? ఎంత మంది వచ్చారు ? ఎక్కడి నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది ? కరోనా జాగ్రత్తలు ఏమేమి అధికార సిబ్బంది పాటిస్తున్నారు ? తదితర అంశాలపై ఆరా తీశారు.  కరోనా లక్షణాలు ఉన్నట్లు అయితే వెంటనే వారిని గాంధీ దవాఖానకు తరలించి ప్రత్యేక పరీక్షలు, వైద్యం, ఇతర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని వైద్యశాఖ, ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు వెల్లడించారు.


పూర్తిస్థాయిలో నివారణకు చర్యలు..  

శంషాబాద్‌ ఏయిర్‌పోర్టులో ప్రతిరోజు సుమారు వేలాది మంది విదేశాల నుంచి వస్తుంటారని, వారికి స్క్రీనింగ్‌ విధిగా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఎయిర్‌పోర్టు అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక డాక్టర్లు తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. స్కానింగ్‌లో అనుమానిత వ్యక్తి ఉంటే అతడిని ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో మాస్కులు ధరించి అంబులెన్స్‌లో గాంధీకి తరలించడం జరుగుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతివ్యక్తిని పూర్తిగా పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు.  ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


logo