మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 09, 2020 , 04:13:05

మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట

మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట

తెలుగుయూనివర్సిటీ:  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి మహామూద్‌ అలీ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిఘటన మహిళా శక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు మహిళలకు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్‌, భరోసా కేంద్రాలతో పాటు పోలీస్‌ శాఖలో 32 శాతం, మున్సిపల్‌ ఎన్నికలలో 55 శాతం పదవులను మహిళలకు కేటాయించినట్లు చెప్పారు. అనంతరం సంస్థ అధ్యక్షురాలు శీలం సరస్వతి, గంగాధర్‌ యాదవ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాధిక, సర్వేందర్‌, అనురాధ, జయశంకర్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


కొండాపూర్‌లోని సియెస్టా హోటల్‌లో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమర యోధురాలు ఈశ్వరీబాయి జీవిత చరిత్రకు సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ లఘు చిత్రం వరల్డ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతారెడ్డి హజరై చిత్ర యూనిట్‌తో పాటు నటి హరిప్రియలతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ ... తన తల్లి ఈశ్వరీబాయి చిత్రం వరల్డ్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.  ఈశ్వరీబాయి 1951లో మున్సిపల్‌ కౌన్సిలర్‌, ఎమ్మెల్యేగా సేవలను అందించారని గుర్తుచేశారు. వీటితో పాటు మహిళా శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలుగా వ్యవహరించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. అనంతరం ఉత్తమ మహిళ సాధికారత అవార్డును గీతారెడ్డి అందుకున్నారు. -మాదాపూర్‌


logo
>>>>>>