సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 08, 2020 , 01:32:08

నగరం నిద్ర పోతున్న వేళ ..

నగరం నిద్ర పోతున్న వేళ ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరమంతా నిద్రిస్తున్నవేళ వారు పనుల్లోకి వెళ్తారు. కనీసం చాయ్‌ కూడా తాగకుండానే విధుల్లో నిమగ్నమవుతారు. పిల్లా-పాపలను, కుటుంబాన్ని వదిలి నగరాన్ని శుభ్రంచేసేందుకు బయలుదేరుతారు. కోటిమంది జనాభా ఆరోగ్యాలను కాపాడడంలో వారి కృషి చెప్పనవికావు. వారు ఒక్కరోజు పని మానేస్తే వీధులన్నీ చెత్తా-చెదారంతో నిండిపోయి కంపు కొడుతాయి. వారే నగరంలోని మహిళా పారిశుధ్య కార్మికులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వీరి సేవలను గుర్తించడం మనందరి బాధ్యత.


ఉదయం ఐదింటికే.. :  నగర జనాభా దాదాపు ఒక కోటికి పైగా కాగా రోడ్ల పొడ వు 9000 కిలోమీటర్లు. వీటిని శుభ్రం చేసేందుకు దాదాపు 22 వేలమందికి పైగా కార్మికులు శ్రమిస్తున్నారు. స్వీపింగ్‌ పనుల్లో 22 వేలమంది కార్మికులు పనిచేస్తుండగా, అందులో 21వేలమంది మహిళలున్నారు. ఇందులో రెండువేల మంది పర్మినెంటు ఉద్యోగులు కాగా, మిగిలినవారు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు ఉదయమే ఐదు గంటలకల్లా తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకొని వీధులు శుభ్రం చేస్తుంటారు. వీరు కాకుండా మరో 2000 మంది మహిళా కార్మికులు స్వచ్ఛ ఆటోల్లో పనిచేస్తున్నారు. వీరంతా ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తుంటారు.


logo