సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 06, 2020 , 01:21:37

లింకురోడ్లు..

లింకురోడ్లు..
 • 313.65 కోట్లతో నిర్మాణం
 • మూడు నెలల్లో పూర్తే లక్ష్యం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వివిధ ప్రాంతాల్లో రెండు ప్రధాన రోడ్లను కలుపుతూ ప్రతిపాదించిన లింకురోడ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. మూడు నెలల్లో వీటిని పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను అదుపు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు కాలనీల మీదుగా ప్రధాన రోడ్లను కలిపేందుకు 37 లింకు రోడ్లను ప్రతిపాదిస్తూ..సమగ్ర కార్యప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం కూడా ఇదివరకే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూసేకరణ జీహెచ్‌ఎంసీ చేపడుతుండగా,  నిర్మాణ బాధ్యతను హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. నాలుగు ప్యాకేజీలుగా పనులు చేస్తారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 37 లింకురోడ్లుగా అభివృద్ధి చేయనుండగా, వీటి మొత్తం పొడవు 44.70 కిలోమీటర్లు. రూ. 313.65కోట్లు వ్యయం అవుతుందని అంచనా. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న  ఈ రహదారుల నిర్మాణంలో ఖర్చులో 50శాతం, అంటే రూ. 157 కోట్లు జీహెచ్‌ఎంసీ భరించనుండగా, మిగిలిన 50 శాతం మొత్తాన్ని ప్రభుత్వం తమకు కేటాయించే బడ్జెట్‌ నిధులతో హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఖర్చు చేస్తున్నది. 


నాలుగు ప్యాకేజీలుగా పనులు... 

 • రూ. 79.87కోట్లతో ప్యాకేజీ-ఏ 1లో చేపడుతున్న రోడ్లు...
 • నిజాంపేట్‌ క్రాస్‌రోడ్స్‌-హైటెక్స్‌ జంక్షన్‌ వయా వసంత్‌నగర్‌, ఎన్‌ఏసీ(2.20కి.మీ.లు)
 • హెచ్‌టీ లైన్‌-మియాపూర్‌ రోడ్‌ (1.00కి.మీ.)
 • భరత్‌నగర్‌ ఆర్‌వోబీ-హైటెక్స్‌ రోడ్‌ వయా మోతీనగర్‌, బోరబండ అరబిందో లులూ మాల్‌, గౌసియా మసీద్‌(0.70కి.మీ.)
 • మాధవి హిల్స్‌-నార్నే రోడ్‌ వయా కేమ్‌- లాట్‌(0.16కి.మీ.లు)
 • శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ జోనల్‌ ఆఫీసు-ఎన్‌హెచ్‌ 65, జీఎస్‌ఎం మాల్‌ వయా మంజీరా పైప్‌లైన్‌ రోడ్‌ (2.70కి.మీ.లు)
 • బొటానికల్‌ గార్డెన్‌ రోడ్‌ (కొండాపూర్‌)- హఫీజ్‌పేట్‌ రైల్వే ట్రాక్‌ వయా జేవీహిల్స్‌ (0.73కి.మీ.లు)
 • బయోడైవర్సిటీ లింకురోడ్‌ (0.13 కి.మీ.లు)
 • ఓల్డ్‌ బాంబే హైవే-ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వయా ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ (2.30కి.మీ.లు)
 • ఓల్డ్‌ బాంబే హైవే-ఖాజాగూడ రోడ్‌ వయా మల్కంచెరువు, చిత్రపురి కాలనీ (0.78కి.మీ.లు)
 • ఎన్‌ఏసీ-కేపీహెచ్‌ రోడ్‌ (0.90కి.మీ.లు)

రూ. 76.30కోట్లతో ప్యాకేజీ-ఏ2లో..

 • హైటెక్‌సిటీ ఫేస్‌-2 - గచ్చిబౌలి ఇనార్బిట్‌ రోడ్‌(0.56కి.మీ.లు)
 • న్యూ అల్లాపూర్‌-100 ఫీట్‌ రోడ్‌, సున్నంచెరువు వెంబడి(0.84కోట్లు)
 • సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌- పీర్జాదిగూడ రోడ్‌ (4.74కి.మీ.లు)
 • గోపన్‌పల్లి-విప్రో సర్కిల్‌(0.50కి.మీ.లు)
 • క్యూ సిటీ - ఎన్‌ఐఏబీ వయా మై హోమ్‌ విహంగ(2.04కి.మీ.లు)
 • జేవీ హిల్స్‌ పార్కు- మసీద్‌బండ రోడ్‌ వయా ప్రభుపాద లేఔట్‌ హెచ్‌టీ లేన్‌ కింద(1.0కి.మీ.లు)
 • అల్కాపురి బస్‌స్టాప్‌-బండ్లగూడ రోడ్‌ వయా సాయినగర్‌ చెరువు(0.70కి.మీ.లు)
 • నెక్నంపూర్‌ రోడ్‌- ఉస్మాన్‌ సాగర్‌ రోడ్‌ వయా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌(0.46కి.మీ.)


రూ. 91.02 కోట్లతో ప్యాకేజీ బీ1లో..

 • మియాపూర్‌ మెట్రో డిపో-కొండాపూర్‌ మసీద్‌ జంక్షన్‌ వయా ఐడీపీఎల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, శిల్పా పార్కు ప్రైడ్‌ రోడ్‌(1.80కి.మీ.లు)
 • షేక్‌పేట్‌ దర్గా జంక్షన్‌ (ఓల్డ్‌ ముంబై రోడ్‌)- ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌రోడ్‌ మైహోమ్‌ అవతార్‌ వద్ద వయా షేక్‌పేట్‌, మణికొండ రోడ్‌, ల్యాంకో హిల్స్‌ రోడ్‌, -నార్సింగి-పుప్పాలగూడ రోడ్‌(3.0కి.మీ.లు)
 • వెస్టిన్‌ హోటల్‌ - మాదాపూర్‌ మెయిన్‌రోడ్‌(0.30కి.మీ.)
 • ఓల్డ్‌ ముంబై హైవే(లెదర్‌ పార్క్‌)- రోడ్‌ నం-45 హెచ్‌టీ లైన్‌ కింద (1.2కి.మీ.లు)
 • ఖాజాగూడ లేక్‌-ఓఆర్‌ఆర్‌ ప్యారలల్‌-ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్‌ వాల్‌(1.7కి.మీ.లు)
 • చిత్రపురి కాలనీ-మణికొండ వయా నాలా(0.7కి.మీ.లు)
 • నోవాటెల్‌-ఆర్‌టీఏ ఆఫీస్‌(0.60కి.మీ.)
 • కూకట్‌పల్లి ఫేస్‌-4- స్లిప్‌ రోడ్‌(0.25కి.మీ.)


రూ. 66.46 కోట్లతో ప్యాకేజీ బీ2లో..

 • ఐఎస్‌బీ రోడ్‌- ల్యాంకో హిల్స్‌ జంక్షన్‌(3.10కి.మీ.లు)
 • బాపూఘాట్‌ బ్రిడ్జి-అత్తాపూర్‌ బ్రిడ్జి(0.75కి.మీ.)
 • గన్‌రాక్‌-ఎస్‌హెచ్‌-1(1.45కి.మీ.లు)
 • అంబేడ్కర్‌ విగ్రహం- గోల్‌నాకా వయా కమేలా(0.17కి.మీ.లు)
 • నాచారం, మల్లాపూర్‌ రోడ్‌- మౌలాలి ఫ్లైఓవర్‌(0.66కి.మీ.)
 • రాధిక క్రాస్‌రోడ్స్‌- బాలాజీనగర్‌ డంపింగ్‌యార్డ్‌(3.10కి.మీ.లు)
 • బోడుప్పల్‌ కాలనీ రోడ్‌-మల్లాపూర్‌ రోడ్‌(పద్మావతి కాలనీ బస్‌స్టాప్‌) వయా రామా చెరువు(0.94కి.మీ.)
 • బతుకమ్మ ఘాట్‌ ఉప్పల్‌(ఘట్‌కేసర్‌ రోడ్‌)-బోడుప్పల్‌ కాలనీ రోడ్‌(1.20కి.మీ.లు)
 • అక్షయ ఫుడ్‌ కోర్ట్‌, గోకుల్‌నగర్‌-హెచ్‌ఎండబ్ల్యూస్‌ ఎన్‌హెచ్‌-9 వయా ఐడీపీఎల్‌ కాలనీ(0.20కి.మీ.)
 • సరూర్‌నగర్‌-హయాత్‌నగర్‌ రోడ్‌ వయా ఇండోర్‌ స్టేడియం(0.60కి.మీ.)
 • జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-70(ప్రశాసన్‌నగర్‌)- జూబ్లీహిల్స్‌ నార్నే రోడ్‌ నం-78(0.48కి.మీ.)


logo