గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 05, 2020 , 01:18:21

సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

అబిడ్స్‌,నమస్తే తెలంగాణ: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. బుధవారం గోషామహల్‌ నియోజకవర్గం పరిధిలోని చందన్‌వాడి బస్తీలో రూ.కోటి ఇరవై రెండు లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీవరేజ్‌ లైన్‌ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గోషామహల్‌ డివిజన్‌లో తాను గతంలో పర్యటించినప్పుడు స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు సీవరేజ్‌ లైన్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు విడుదలయ్యేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేయించి అభివృద్ధి పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ విధమైన సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం మంత్రి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీ ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను వెం టనే తొలగించాలని టౌన్‌ప్లానింగ్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులను ఆదేశించారు. సీవరేజ్‌ లైన్‌ నిర్మాణ పనులు పూర్తి కాగానే నూతన రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. మూడు నెలల క్రితం మంత్రి చందన్‌వాడి బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 


స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చి జలమండలి ఎండీ దానకిశోర్‌తో మా ట్లాడి బస్తీ ప్రజల సమస్యల పరిష్కారానికి సీవరేజ్‌ లైన్‌ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నిధులు మంజూరు కావడంతో గోషామహల్‌ కార్పొరేటర్‌ ముఖేశ్‌సింగ్‌ మంత్రి తలసా ని శ్రీనివాస్‌ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే,  గోషామహల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌, గోషామహల్‌ కార్పొరేటర్‌ ముఖేష్‌సింగ్‌తోపాటు మంగళ్‌హా ట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌, గన్‌ఫౌండ్రి డివిజన్‌ కార్పొరేటర్‌ మమతా సంతోష్‌గుప్తా, జీహెచ్‌ఎంసీ డీసీ వినయ్‌కపూర్‌, జలమండలి డైరెక్టర్‌ కృష్ణ, డీజీఎం శ్రీనివాస్‌, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ మెహ్రా, టీఆర్‌ఎస్‌ నాయకు లు ఎస్‌ ధన్‌రాజ్‌, కోటి శైలేష్‌కురుమ, సంతోష్‌ గుప్తా, సురేష్‌ముదిరాజ్‌, శీలం సరస్వతి, నాగభూషణచారి, హెచ్‌.కుమార్‌, సాయికుమార్‌, సునీల్‌సాహు, హరీష్‌ గుప్తా, జైశంకర్‌, ప్యాట శ్రీను, నవీన్‌వర్మ, ప్రకాశ్‌ గుప్తా, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo