శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 04, 2020 , 02:04:31

‘బల్దియా’ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం

 ‘బల్దియా’ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : యశోద దవాఖాన, విజ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సంయుక్తాధ్వర్యంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాల్లో రెగ్యులర్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్యసేవలు పొందారు. ఈనెల 11వ తేదీవరకు జోనల్‌ కార్యాలయాల్లో కూడా శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్లు, ఆయా జోన్లలోని ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఎల్బీనగర్‌లో జోన్‌లో 4న, చార్మినార్‌లో 5న, ఖైరతాబాద్‌లో 6న, సికింద్రాబాద్‌లో 7న, కూకట్‌పల్లిలో 10న, శేరిలింగంపల్లిలో 11వ తేదీన శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో బీపీ, బ్లడ్‌ షుగర్‌, గైనకాలజీ కన్సల్టేషన్‌ తదితర సేవలతోపాటు డాక్టర్‌ సలహా మేరకు చెస్ట్‌ ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. logo