ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 03, 2020 , 05:36:16

45 శాతం సబ్సిడీతోమహిళలకు ‘క్యాబ్‌'లు

45 శాతం సబ్సిడీతోమహిళలకు ‘క్యాబ్‌'లు
  • ఉచితంగా డ్రైవింగ్‌ శిక్షణ
  • ఈజీ కమ్యూట్‌ కామెంటెడ్‌ యాప్‌లో మార్చి 8 నుంచి సేవలు ప్రారంభం
  • యోదీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘వుమెన్‌ ఆన్‌ వీల్‌'
  • తొలుత నలుగురు మహిళా డ్రైవర్లు తర్వాత 100 మందికి శిక్షణ

మహిళలకు అన్ని వైపుల నుంచి భద్రత కల్పిస్తున్న మన నగరంలో మరో అడుగు పడింది. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా క్యాబ్‌లు అందించేలా యోదీ ఫౌండేషన్‌ ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నది. రెండేండ్ల క్రితం బీజం పడిన ‘వుమెన్‌ ఫర్‌ వుమెన్‌ ట్యాక్సీ సర్వీస్‌- వుమెన్‌ ఆన్‌ వీల్స్‌' ఆలోచనకు                 కొనసాగింపుగా మహిళలకు 45శాతం సబ్సిడీతో సీఎన్‌జీ వాహనాలు అందించనున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. తొలుత నలు గురికి శిక్షణ ఇచ్చి వాహనాలు అందించనున్నారు. తర్వాత వందమందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 8న బంజారాహిల్స్‌లోని ముఫకంజా కళాశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కార్లు పంపిణీ చేయనున్నారు. 


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  అసలు సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న..‘ఎవరిని నమ్మాలి?’..నిజమే మనిషి.. సాటి మనిషిని నమ్మే కాలం పోయింది. ఎక్కడో అక్కడ..ఎవ్వరో.. ఏ రూపంలో. మోసానికి పాల్పడుతారో తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ‘ఎవరిని నమ్మాలి?’ అనే ప్రశ్న మహిళలను ఎప్పుడూ వెంటాడుతునే ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగొచ్చే వరకు క్షణక్షణం భయమే. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు  ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయం. మహిళల సంరక్షణకు విభిన్న రకాల కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ‘యోదీ ఫౌండేషన్‌' నిర్వహిస్తున్న  ఆమె కోసం ఆమె పేరుతో వుమెన్‌ ఆన్‌ వీల్‌ కార్యక్రమానికి సహకారం అందిస్తుంది. మహిళల ప్రయాణం సాఫీగా సాగేలా మహిళా డ్రైవర్లతో క్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.


మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా భాగ్యనగర రోడ్లపై ఆ కార్లు పరుగులు పెట్టనున్నాయి. కేవలం మహిళా ప్రయాణికుల కోసమే ఈసేవలు అందుబాటులోకి రావడం విశేషం. బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్‌ ప్లాజా హోటల్‌లో సోమవారం యేదీ ఫౌండేషన్‌ ఫౌండర్‌ జ్యోత్స్నఅంగర కార్యక్రమానికి సంబంధించిన ‘వుమెన్‌ ఆన్‌ వీల్‌' పాంప్లెట్‌ను ఆవిష్కరించారు. 


ఆమెకు అండగా ఆమే..!

మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, ప్రయాణ సమయంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై యోదీ ఫౌండేషన్‌ ఫౌండర్‌ జ్యోత్స్న అధ్యయనం చేశా రు. మహిళలు వారికి వారూ అండగా ఉంటూ.. తమను తాము రక్షించుకునే మార్గాలను అందించాలని పూనుకున్నారు. అందులోభాగంగానే  రెండేండ్ల క్రితం వుమెన్‌ ఫర్‌ వుమెన్‌ ట్యాక్సీ సర్వీస్‌- వుమెన్‌ ఆన్‌ వీల్స్‌' కార్యక్రమానికి బీజం పడింది. ఆమె ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. ప్రయాణ సమయంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రభుత్వ సహకారంతో 45శాతం సబ్సిడీ అందించి సెలేరియో సీఎన్‌జీ వాహనాలను ఇస్తారు. ఎకో ఫ్రెండ్లీ వెహికిల్స్‌ను అందించి పర్యావరణానికి ఆటంకం కలగకుం డా జాగ్రత్తలు తీసుకోవడం మరో విశేషం. మొత్తం వం దమంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 8న బంజారాహిల్స్‌లోని ముఫకల్లా కాలేజీలో స్త్రీ,శిశు సం క్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ చేతుల మీదుగా వాహనాలను పంపిణీ చేయనున్నారు.


తొలుత నలుగురికి...

తొలుత నగరానికి చెందిన డి.శారద, ధనలక్ష్మి, సౌజన్య, శారదలకు ప్రవేశం కల్పించారు. వందలాదిగా వచ్చిన దరఖాస్తుల్లో కొంతమందిని ఎంపిక చేసి కారు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రయాణ సమయంలో ప్రమాదాలు సంభవిస్తే ఏం చేయాలి? యాక్సిడెంట్‌ బాధితులకు ప్రథమ చికిత్స ఎలా అందించాలి? ట్రాఫిక్‌లో ఎలాంటి నిబంధనలు పాటించాలి? తదితర సమగ్ర విషయాలను వారికి నేర్పించారు. 


రైడ్‌ బుకింగ్‌ ఇలా..!!

‘ఈజీ కమ్యూట్‌ కమెంటెడ్‌' యాప్‌లో లాగిన్‌ అయి వుమెన్‌ ఆన్‌ వీల్‌ ఆప్షన్‌లో బుకింగ్‌ సదుపా యం ఉంటుంది. మార్చి 8న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు క్యాబ్‌ సర్వీస్‌లోకి రావాలనుకునే ఆసక్తిగల మహిళలు వారి వివరాలతో WWW.YODEE. ORG,7702223405 నంబర్‌లో సంప్రదించాలి. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతోపాటు లోన్‌ సదుపా యం కల్పిస్తారు. 


మహిళల రక్షణే ఎజెండా

మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు వారి రక్షణ బాధ్యతలు చూడడం ప్రస్తుతం చాలా ముఖ్యం.  మహిళలు సాధికారిత సాధించాలి. ఆత్మవిశ్వాసంతో అడుగువేయాలి. దేశం లో ప్రతి రంగంలో మహిళల పాత్ర గొప్పది. క్యాబ్‌ సర్వీస్‌లో కూడా వారు అడుగుపెట్టి ఆదర్శంగా నిలవాలి. ఆసక్తిగల మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి అండగా ఉంటాం. ఈ బృహత్తర కార్యక్రమానికి అండగా ఉంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.   

-జ్యోత్స్న అంగర, యోదీ ఫౌండేషన్‌ ఫౌండర్‌


అడుగు వేస్తే అవకాశాలెన్నో

ఒకప్పుడు వంటింటికే పరిమితమయ్యే మహిళలు.. ప్రస్తు తం గగనతలంలో యుద్ధ విమానాలు నడిపే స్థాయికి ఎదిగారు. బయటి సమాజం తెలియని వాళ్లు చాలామంది ఇంకా ఇండ్లు వదిలి రావడానికి భయపడుతున్నారు. అడుగువేస్తే అవకాశాలెన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో యోదీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్యాబ్‌ సర్వీస్‌లో శిక్షణ పొంది ఉపాధిని సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. 

- ధనలక్ష్మి, క్యాబ్‌ డ్రైవర్‌


logo