శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 03, 2020 , 05:30:01

జంక్షన్లు సుందరీకరించాలి

జంక్షన్లు సుందరీకరించాలి
  • రహదారులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
  • మేయర్‌ బొంతు రామ్మోహన్‌
  • వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పరిశీలన

సిటీబ్యూరో, ఎల్బీనగర్‌, లింగోజిగూడ, కేపీహెచ్‌బీకాలనీ, చంపాపేట, జంక్షన్లను సుందరీకరించాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్బీనగర్‌, చార్మినార్‌ జోన్లలో నిర్మిస్తున్న పైవంతెనలు, అండర్‌పాస్‌ పనులను సోమవారం పరిశీలించారు. నాగోల్‌, కామినేని, బైరామల్‌గూడ, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌ తదితర పనులను తనిఖీ చేసిన మేయర్‌... వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వీటితో పాటు సమగ్ర రోడ్ల నిర్వహణ  ప్రణాళిక(సీఆర్‌ఎంపీ) కింద చేపట్టిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతు పనులను సైతం పరిశీలించారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. వాణిజ్య ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్లను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. 


ఆగస్టు నాటికి... 

హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలని, ఆగస్టు నాటికి అందుబాటులోకి తేవాలని మేయర్‌ స్పష్టం చేశారు. ఆర్‌యూబీ బ్రిడ్జి పనులు పరిశీలించారు. అంతకుముందు ఉదయం ఐదు గంటలకు మేయర్‌ మెట్టుగూడలో పర్యటించి పారిశుధ్య పనులు తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో  ఎమ్మెల్యేలు గాంధీ, సుధీర్‌రెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌, తూర్పు జోనల్‌ కమిషనర్‌ ఊపేందర్‌రెడ్డి, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత తదితరులు పాల్గొన్నారు.  logo