గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 02, 2020 , 05:56:02

పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ

పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ
  • కాలనీల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించండి
  • దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తాం
  • చిరువ్యాపారులను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు
  • అల్మాస్‌గూడ పట్టణ ప్రగతి కార్యక్రమంలో
  • పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

బడంగ్‌పేట,(నమస్తే తెలంగాణ):ప్రణాళికబద్ధ్దంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాయి బాలాజీ, ఆర్‌బీఆర్‌, సీఎంఆర్‌, సీవైఆర్‌, 2,3,4,25 వార్డులలో ఉన్న కాలనీల్లో మంత్రి పర్యటించారు. కాలనీల్లో నెలకొన్న  సమస్యలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఏ కాలనీలో ఏ సమస్య ఉందో అధికారులు ,కార్పొరేటర్స్‌ కలిసి గుర్తించాలన్నారు. ఆ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం అనేది నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ పది రోజుల్లో కాలనీల్లో ఉన్న సమస్యలను మాత్రమే గుర్తిస్తామన్నారు. కాలనీలో ఉన్న సమస్యల పట్ల ఒక అంచనాకు వచ్చిన తర్వాత దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రేపటితోపట్టణ ప్రగతి కార్యక్రమం అయిపోతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిరువ్యాపారులను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని  సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రితెలిపారు. బాలాపూర్‌ చౌరస్తాలో, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో  ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. చిరువ్యాపారులకు అక్కడే షాపులను కేటాయిస్తామన్నారు. 


ఏ ప్రాంతంలో ఎన్ని  పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలో అధికారులు గుర్తించాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్స్‌ , అధికారులు నీటి సామర్థ్యాన్ని పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహాలను తెలుసుకోవాలన్నారు.  నీటి సమస్యపై కార్పొరేటర్స్‌ దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కేవలం 17వేల నీటి కనెన్షన్లు ఉన్నాయన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా లేదన్నారు.రాజీవ్‌ గృహకల్పలోని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఓపెన్‌ ప్లేస్‌లో కమ్యూటీ హాల్స్‌ నిర్మా ణం చేయిస్తామన్నారు.కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్స్‌ స్వప్నవెంకట్‌రెడ్డి, దీపిక శేఖర్‌రెడ్డి,వీరకర్ణారెడ్డి, కవితారాంరెడ్డి, పద్మఐలయ్య, లలితకృష్ణ, రాంరెడ్డి,కమిషనర్‌ సత్తిబాబు, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, డీఈ అశోక్‌రెడ్డి, అధికారులు యాదగిరి, వివిధ వార్డుల ప్రజాప్రతినిధులు,టీఆర్‌ఎస్‌ నాయకులు, వివిధ కాలనీల అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు. logo