సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Mar 02, 2020 , 03:37:38

పట్ణణప్రగతితో మున్సిపాలిటీల అభివృద్ధి

పట్ణణప్రగతితో మున్సిపాలిటీల అభివృద్ధి
  • పట్టణ ప్రగతిలో భాగంగా నాగారం,ఘట్‌కేసర్‌లో
  • పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి
  • పరిశుభ్రతకు,పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి

కీసర/ఘట్‌కేసర్‌: ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధ్ది అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో  దాదాపు రూ. 80లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కీసర మండల పరిధిలోని నాగారం మున్సిపల్‌ పరిధిలోని 6వ వార్డులోని శిల్పానగర్‌ కాలనీ కార్యాలయ భవన నిర్మాణం రూ.6లక్షలు, 7వ వార్డు శిల్పానగర్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం రూ.3లక్షలతో నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి,  కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద్ద చైర్మన్‌ ముల్లిపావనీజంగయ్య యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటి వరకు పంచాయతీ విధానంలో ఉన్న ఘట్‌కేసర్‌ ప్రస్తుతం నాలుగు గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా రూపొందించిన కొత్త మున్సిపల్‌ చట్టంతో భారీగా నిధులు వస్తాయని, దీంతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందన్నారు. 


ప్రతి నెల మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్‌ రూ.148 కోట్ల నిధులను విడుదల చేస్తున్నారన్నారు. ఇందులో భాంగా, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీకి ఇప్పటికే రూ.23 లక్షల నిధులు వచ్చాయని మంత్రి తెలిపారు. పాలక వర్గం సంఘటితంగా ఉండి ఘట్‌కేసర్‌ను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం  ఉందని చెప్పారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని మంత్రి అభినందించారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. అలాగే  నాగారం మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డులోని బస్తీలో మంత్రి పాదయాత్ర చేపట్టి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాల్టీలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు.  


ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో పరిశుభ్రత భేష్‌:కలెక్టర్‌

 ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో పరిశుభ్రత స్పష్టంగా కనిపిస్తుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. ఇతర మున్సిపాలిటీల కంటే  ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని  వార్డులు పరిశుభ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించి మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. 


 అంతకు ముందు మారుతీనగర్‌లో ఓపెన్‌ జిమ్‌, కొండాపూర్‌లో వైకుంఠధామం, ఇదే ప్రాంతంలో పార్కు,6 వార్డులో ప్లేగ్రౌండ్‌కు ఫెన్సింగ్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ సాంసన్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, సొసైటీ చైర్మన్‌ రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ యాదగిరి యాదవ్‌, మున్సిపాలిటీ కౌన్సిలర్లు వెంకట్‌రెడ్డి,  రమాదేవి,సంగీత, ఆంజనేయులు, అనురాధ,నస్రిన్‌ సుల్తానా, నాగజ్యతి, హేమలత, శశికళ,మల్లేశ్‌, పద్మారావు,జాంగీర్‌,వసంత, నరేశ్‌యాదవ్‌, రవీందర్‌ , స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కీసరలో జరిగిన కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌యాదవ్‌, మున్సిపల్‌ కమషనర్‌ వాణి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌, నాగారం వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


logo